Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి, కొరటాల... పలాస నుంచి మొదలు

మెగా స్టార్ చిరంజీవి హీరో గా ఇటీవలే సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా దసరాకి విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలో నే చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఒక కొత్త చిత్రం చేయనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఒక రూరల్ డ్రామా గా తెరకెక్కించబడుతుంది. ఈ సినిమా లో చిరంజీవి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారట. కొరటాల శివ తనదైన శైలి […]

చిరంజీవి, కొరటాల... పలాస నుంచి మొదలు
X

మెగా స్టార్ చిరంజీవి హీరో గా ఇటీవలే సై రా నరసింహ రెడ్డి సినిమా షూటింగ్ అయిపోయింది. ఈ సినిమా దసరాకి విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలో నే చిరంజీవి కొరటాల శివ దర్శకత్వం లో ఒక కొత్త చిత్రం చేయనున్నారు.

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ సినిమా ఒక రూరల్ డ్రామా గా తెరకెక్కించబడుతుంది. ఈ సినిమా లో చిరంజీవి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారట.

కొరటాల శివ తనదైన శైలి లో హీరో క్యారెక్టర్ ని డిజైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ సినిమా ని సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

అందులో భాగం గా ఈ సినిమా షూటింగ్ ని పలాస లో మొదలు పెట్టాలని అనుకుంటున్నారట. అప్పుడెప్పుడో ప్రజారాజ్యం పార్టీ ప్రచార కార్యక్రమాల సమయంలో శ్రీకాకుళం లోని పలాసలో తిరిగిన చిరంజీవి…. ఇన్నేళ్లకు మళ్ళీ పలాసలో అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా లో ఐశ్వర్య రాయ్ హీరోయిన్ గా నటించనుంది అనే వార్తలు వస్తున్నాయి… కానీ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ ఇవ్వలేదు.

First Published:  24 July 2019 3:41 AM GMT
Next Story