Telugu Global
Cinema & Entertainment

ముందు "సై రా".... ఆతరువాతే డిసైడ్ అవుతాడట..!

సై రా నరసింహ రెడ్డి వంటి పెద్ద ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. అయితే అనూహ్యం గా రామ్ చరణ్ తో ధృవ సినిమా చేయడం, అది పెద్ద విజయం సాధించటం తో, వెంటనే చిరంజీవితో కూడా పని చేసే అవకాశం వచ్చింది సురేందర్ రెడ్డి కి. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా…. దసరా కి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే […]

ముందు సై రా.... ఆతరువాతే డిసైడ్ అవుతాడట..!
X

సై రా నరసింహ రెడ్డి వంటి పెద్ద ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేస్తున్నాడు సురేందర్ రెడ్డి. అయితే అనూహ్యం గా రామ్ చరణ్ తో ధృవ సినిమా చేయడం, అది పెద్ద విజయం సాధించటం తో, వెంటనే చిరంజీవితో కూడా పని చేసే అవకాశం వచ్చింది సురేందర్ రెడ్డి కి.

అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా…. దసరా కి విడుదల అయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి? ఏ హీరో తో జత కడతాడు? అనే విషయాల పై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు దీని పై క్లారిటీ లేదు…. కానీ ఇండస్ట్రీ లో వినిపిస్తున్న కథనాల ప్రకారం సురేందర్ రెడ్డి తో అందరు స్టార్ హీరో లు టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.

మహేష్ బాబు సైతం సురేందర్ రెడ్డి తో మళ్ళీ పని చేయాలనే ఆలోచనలో ఉన్నాడట.

అయితే సురేందర్ రెడ్డి మాత్రం ప్రభాస్ ని కలిసి ఒక కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడట.

ఇక రామ్ చరణ్ కూడా వినయ విధేయ రామ డిజాస్టర్ తో…. సురేందర్ రెడ్డి తో ఇంకో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సై రా విడుదల అయితే కానీ ఈ విషయం ఒక కొలిక్కి రాదు.

First Published:  24 July 2019 1:41 AM GMT
Next Story