Telugu Global
Cinema & Entertainment

టీజర్ తో రిలీజ్ డేట్ చెబుతారా?

నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాపై చాలా బజ్ నడుస్తోంది. ఈ సినిమా స్టోరీలైన్ పై ఇప్పటికే లీకులు రావడం, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికితోడు ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ అని కూడా తెలుస్తోంది. ఇదే ఊపులో సినిమా ప్రచారాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు మేకర్స్. ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు గ్యాంగ్ లీడర్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే టీజర్ ఎలా […]

టీజర్ తో రిలీజ్ డేట్ చెబుతారా?
X

నాని హీరోగా నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమాపై చాలా బజ్ నడుస్తోంది. ఈ సినిమా స్టోరీలైన్ పై ఇప్పటికే లీకులు రావడం, ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. దీనికితోడు ఇదొక కామెడీ ఎంటర్ టైనర్ అని కూడా తెలుస్తోంది. ఇదే ఊపులో సినిమా ప్రచారాన్ని మరింత పెంచాలని నిర్ణయించారు మేకర్స్. ఇందులో భాగంగా టీజర్ రిలీజ్ చేయబోతున్నారు

గ్యాంగ్ లీడర్ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. అయితే టీజర్ ఎలా ఉంటుందనే ఆసక్తితో పాటు ప్రేక్షకులకు ఇప్పుడు మరో ఆసక్తి కూడా ఎక్కువైంది. అదే రిలీజ్ డేట్. ఈ సినిమా విడుదల తేదీని టీజర్ తో పాటు ప్రకటిస్తారేమో అని అంతా ఎదురుచూస్తున్నారు. దీనికి ఓ కారణం ఉంది.

సాహో సినిమా వాయిదాపడిన సంగతి తెలిసిందే. దాన్ని నేరుగా తీసుకొచ్చి గ్యాంగ్ లీడర్ పైన వేశారు. దీంతో గ్యాంగ్ లీడర్ సినిమా పోస్ట్ పోన్ అయింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది ఇప్పటివరకు ప్రకటించలేదు. రేపు టీజర్ తో పాటు ఈ విడుదల తేదీని ప్రకటిస్తారనే అంచనాలున్నాయి.

నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ప్రియాంక, లక్ష్మీ, శరణ్య, అనీష్‌ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిశోర్‌, సత్య ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  23 July 2019 8:12 PM GMT
Next Story