Telugu Global
Cinema & Entertainment

"సరిలేరు.."లో మరో రీఎంట్రీ

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ లుక్స్, గెటప్ కంటే మిగతా నటీనటుల రీఎంట్రీల గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ సినిమాతో విజయశాంతి, బండ్ల గణేశ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లపై ఆమధ్య కాలంలో నడిచిన చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటి కూడా చేరింది. ఆమె పేరు సంగీత. పెళ్లయిన కొత్తలో, ఖడ్గం లాంటి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించిన సంగీత […]

సరిలేరు..లో మరో రీఎంట్రీ
X

మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ లుక్స్, గెటప్ కంటే మిగతా నటీనటుల రీఎంట్రీల గురించే ఎక్కువ చర్చ నడుస్తోంది. ఈ సినిమాతో విజయశాంతి, బండ్ల గణేశ్ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లపై ఆమధ్య కాలంలో నడిచిన చర్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో నటి కూడా చేరింది. ఆమె పేరు సంగీత.

పెళ్లయిన కొత్తలో, ఖడ్గం లాంటి ఎన్నో చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించిన సంగీత ఇప్పుడీ సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సినిమాలో ఈమెకు ఓ ప్రత్యేక పాత్ర ఆఫర్ చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. ఈ సినిమాతో ఆమె తెలుగులో మరోసారి ఓ వెలుగు వెలగాలని భావిస్తోంది.

సినిమా ఆఫర్లు తగ్గిన టైమ్ లో క్రిష్ అనే సింగర్ ను పెళ్లాడి సెటిల్ అయిపోయింది సంగీత. అలా దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీకి దూరమైన సంగీత, ఇప్పుడు మహేష్ బాబు సినిమాతో రీఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం తెలుగునాట క్యారెక్టర్ ఆర్టిస్టులకు మంచి డిమాండ్ ఉంది. టబు లాంటి పాతతరం హీరోయిన్లకు ఇప్పుడు మరోసారి డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో సంగీతకు కూడా మరోసారి డిమాండ్ ఏర్పడడం ఖాయం.

First Published:  23 July 2019 8:14 PM GMT
Next Story