పూరి తో కాదట… కొరటాలతోనే సినిమా ఉంటుందట !

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై 26 న సౌత్ ఇండియా లోని నాలుగు భాషల్లో విడుదల కాబోతోంది.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఇప్పటికే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో ఒక సినిమాకి సైన్ చేశాడు. ‘హీరో’ అనే ఆసక్తికరమైన టైటిల్ తో ఈ సినిమా త్వరలో పట్టాలెక్కనుంది.

ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలు చేయడానికి ఒప్పుకున్నట్లు వార్తలు వినిపించాయి.

తాజాగా ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ ఈ విషయం పై క్లారిటీ ఇచ్చాడు.

కొరటాల శివ తన అభిమాన దర్శకుడని… తనతో ఎప్పటినుంచో కలిసి సినిమా చేయాలని ఉందని… అయితే ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి తో ఒక సినిమా చేయబోతున్నారు…. ఆ సినిమా పూర్తయిన తర్వాత వచ్చే ఏడాది ఈ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తామని తెలిపాడు.

ఇక పూరి జగన్నాథ్ తో మాత్రం సినిమా లేదంటూ తేల్చి చెప్పాడు. వరుసగా డిజాస్టర్లు అందుకున్నప్పటికీ పూరి జగన్నాథ్ తాజాగా ‘ఇస్మార్ట్ శంకర్’ అనే సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. కానీ విజయ్ మాత్రం స్టార్ డం ఎంజాయ్ చేస్తున్న కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.