Telugu Global
NEWS

అల్లు అర్జున్‌కు ఫైన్

సినీ హీరో అల్లు అర్జున్‌కు చెందిన వాహనానికి శంషాబాద్‌ పోలీసులు జరిమానా విధించారు. అల్లు అర్జున్‌కు చెందిన క్వారవాన్‌ బ్లాక్‌ ఫిల్మ్‌తో కప్పి ఉండడంతో ఈ జరిమానా విధించారు. హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలో టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల క్యారవాన్‌ బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తుండగా కొందరు యువకులు ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టారు. బ్లాక్ ఫిల్మ్‌పై నిషేధం ఉన్నా సరే అల్లు అర్జున్ క్వారవాన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను నెటిజన్లు ప్రశ్నించారు. దీంతో స్పందించిన శంషాబాద్ […]

అల్లు అర్జున్‌కు ఫైన్
X

సినీ హీరో అల్లు అర్జున్‌కు చెందిన వాహనానికి శంషాబాద్‌ పోలీసులు జరిమానా విధించారు. అల్లు అర్జున్‌కు చెందిన క్వారవాన్‌ బ్లాక్‌ ఫిల్మ్‌తో కప్పి ఉండడంతో ఈ జరిమానా విధించారు.

హిమాయత్‌సాగర్‌ ప్రాంతంలో టీఎస్09ఎఫ్‌జీ 0666 నంబర్‌ గల క్యారవాన్‌ బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తుండగా కొందరు యువకులు ఫొటో తీసి ట్విట్టర్లో పెట్టారు. బ్లాక్ ఫిల్మ్‌పై నిషేధం ఉన్నా సరే అల్లు అర్జున్ క్వారవాన్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పోలీసులను నెటిజన్లు ప్రశ్నించారు.

దీంతో స్పందించిన శంషాబాద్ ట్రాఫిక్ పోలీసులు అల్లు అర్జున్ వాహనాన్ని వెళ్లి పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించుకుని వాహన యజమాని అల్లు అర్జున్‌కు రూ. 735 జరిమానా వేశారు. బ్లాక్ ఫిల్మ్ తొలగించాల్సిందిగా ఆదేశించారు.

First Published:  24 July 2019 11:55 PM GMT
Next Story