భర్తతో ఉన్న మహిళకు దేహశుద్ధి

హైదరాబాద్ ప్రగతి నగర్‌లో భర్తకు, అతడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మహిళకు దేహశుద్ది చేసింది ఒక ఇల్లాలు. పెద్దపల్లి జిల్లాకు చెందిన లక్ష్మణ్‌, సౌజన్యకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. వారికి రెండేళ్ల బాబు కూడా ఉన్నారు. కొద్దిరోజులుగా భార్య, పిల్లలను లక్ష్మణ్‌ నిర్లక్ష్యం చేస్తున్నాడు.

ప్రగతి నగర్‌లో అనుషా అనే మరో మహిళతో కాపురం పెట్టాడు. సౌజన్య పోలీసులకు ఫిర్యాదు చేసినా పరిస్థితిలో మార్పు రాలేదు. దాంతో భర్త ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకున్న సౌజన్య… బంధువులతో కలిసి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది.

అనుషాను జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టింది. చెప్పుతో కొట్టి రోడ్డు మీదకు ఈడ్చుకొచ్చింది. సౌజన్య బంధువులు లక్ష్మణ్‌ను చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని అందరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.