Telugu Global
Cinema & Entertainment

వాళ్ళు నా సినిమాలు చూస్తారా?

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో లోనే స్టార్ గా మారాడు. అయితే ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ… తనకి స్టార్డమ్ ఉందో లేదో తెలీదు అని చెబుతున్నాడు. మిగతా స్టార్ హీరోలు సంగతి తనకి తెలీదు కానీ తాను ఇప్పటికీ తన సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అని భయపడుతూ ఉంటానని చెప్పాడు విజయ్. ఒకవేళ అభిమానులు నిజంగానే తన […]

వాళ్ళు నా సినిమాలు చూస్తారా?
X

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ అతి తక్కువ కాలంలో లోనే స్టార్ గా మారాడు. అయితే ప్రస్తుతం ‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ… తనకి స్టార్డమ్ ఉందో లేదో తెలీదు అని చెబుతున్నాడు.

మిగతా స్టార్ హీరోలు సంగతి తనకి తెలీదు కానీ తాను ఇప్పటికీ తన సినిమాలకు ప్రేక్షకులు థియేటర్లకు వస్తారా లేదా అని భయపడుతూ ఉంటానని చెప్పాడు విజయ్. ఒకవేళ అభిమానులు నిజంగానే తన సినిమా చూడటానికి థియేటర్ లోకి వస్తే అప్పుడే తనకి స్టార్ డం ఉన్నట్టు అని అంటున్నాడు.

‘డియర్ కామ్రేడ్’ సినిమా ప్రమోషన్స్ కోసం కేరళ వెళ్లిన విజయ్ దేవరకొండ కోసం వేల మంది అభిమానులు విమానాశ్రయానికి కూడా వచ్చారు. వారిని చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను అని, కానీ కొందరు తనని కలవడానికి లేదా తన మాటలు, ఆటిట్యూడ్ నచ్చి చూడడానికి వచ్చారని…. కానీ వాళ్ళందరూ తన సినిమాలు చూస్తారా లేదా అన్న అనుమానం తనలో ఉందని విజయ్ దేవరకొండ అన్నాడు.

ఇక తెలుగు తమిళం మలయాళం కన్నడ భాషల్లో విడుదల కాబోతున్న తన ‘డియర్ కామ్రేడ్’ సినిమా గురించి మాట్లాడుతూ తనకి ఇష్టమైన వాటి కోసం ఫైట్ చేసే ఒక అమ్మాయి మరియు అబ్బాయి మధ్యన ఉండే ఎమోషనల్ లవ్ స్టోరీ ‘డియర్ కామ్రేడ్’ అని చెప్పాడు విజయ్.

First Published:  24 July 2019 10:55 PM GMT
Next Story