Telugu Global
Cinema & Entertainment

30 కోట్ల క్లబ్ లోకి.... 'ఇస్మార్ట్ శంకర్'

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ళు రాబడుతోంది. నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది.  మొన్నటిదాకా వరుస డిజాస్టర్ లతో సతమతమైన పూరి జగన్నాధ్… మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చారు. ఇటు హీరో రామ్ కెరీర్ లో కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అతి […]

30 కోట్ల క్లబ్ లోకి.... ఇస్మార్ట్ శంకర్
X

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్ టైనర్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్ళు రాబడుతోంది.

నిధి అగర్వాల్ మరియు నభా నటేష్ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా విడుదలై వారం రోజులు పూర్తి చేసుకుంది.

మొన్నటిదాకా వరుస డిజాస్టర్ లతో సతమతమైన పూరి జగన్నాధ్… మళ్లీ ఈ సినిమాతో ఫామ్ లోకి వచ్చారు. ఇటు హీరో రామ్ కెరీర్ లో కూడా ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. విడుదలైన కొన్ని రోజుల్లోనే సినిమా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను తెచ్చిపెడుతోంది.

బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. పూరి జగన్నాథ్ మరియు ఛార్మి కౌర్ సంయుక్తంగా పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరి కనెక్ట్స్ పతాకాలపై నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు.

ఈ సినిమా జూలై 21న విడుదల అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి దాక ‘ఇస్మార్ట్ శంకర్ కలెక్షన్లు 27.67 కోట్లకు చేరింది. త్వరలోనే ‘ఇస్మార్ట్ శంకర్’ 30 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటిదాకా ‘ఇస్మార్ట్ శంకర్’ కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

  • నైజాం: 11 కోట్లు
  • సీడెడ్: 4.20 కోట్లు
  • ఉత్తర ఆంధ్ర: 2.98 కోట్లు
  • ఈస్ట్: 1.62 కోట్లు
  • గుంటూరు: 1.67 కోట్లు
  • వెస్ట్: 1.33 కోట్లు
  • కృష్ణ: 1.59 కోట్లు
  • నెల్లూరు: 0.83 కోట్లు

ఆంధ్రప్రదేశ్+తెలంగాణ : 25.22 కోట్లు

  • రెస్ట్ ఆఫ్ ఇండియా: 1.55 కోట్లు
  • ఓవర్సీస్: 0.90 కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: 27.67 కోట్లు

First Published:  25 July 2019 4:48 AM GMT
Next Story