Telugu Global
NEWS

చంద్రబాబు గాలికి వదిలేశాడు.... సీఎంకు చిత్తశుద్ధి ఉంది

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన ద్రోహి అని శాసనసభ్యురాలు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే సంపూర్ణ మద్య నిషేధం ఫైలుపై సంతకం చేసి ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఇది ప్రజలను… ముఖ్యంగా మహిళలను మోసం చేయడం కాదా..?” అని రోజా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మద్యం పాలసీపై ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. అనంతరం ఈ అంశంపై జరిగిన […]

చంద్రబాబు గాలికి వదిలేశాడు.... సీఎంకు చిత్తశుద్ధి ఉంది
X

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన ద్రోహి అని శాసనసభ్యురాలు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

“చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే సంపూర్ణ మద్య నిషేధం ఫైలుపై సంతకం చేసి ఆ తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేశారు. ఇది ప్రజలను… ముఖ్యంగా మహిళలను మోసం చేయడం కాదా..?” అని రోజా విమర్శించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మద్యం పాలసీపై ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది. అనంతరం ఈ అంశంపై జరిగిన చర్చలో రోజా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 40 వేల బెల్టుషాపులకు అనుమతి ఇచ్చారని, ఇదేనా మద్యపాన నిషేధాన్ని తీసుకు రావడమంటే అని మండిపడ్డారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని రోజా తెలిపారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందే తమ నాయకుడు వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మద్యపాన నిషేధంపై తమ నిర్ణయాన్ని ప్రకటించారని, అందుకు అనుగుణంగా ఇప్పుడు బిల్లు తీసుకు వస్తున్నారని ప్రశంసించారు.

దీనిపై బిల్లు తీసుకువచ్చిన ముఖ్యమంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిన ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తోందని రోజా మండిపడ్డారు.

మద్యపాన నిషేధంపై సీఎంకు చిత్తశుద్ధి ఉంది: అంబటి

రాష్ట్రంలో దశల వారీగా మద్య పాన నిషేధాన్ని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నారని శాసనసభ్యుడు అంబటి రాంబాబు అన్నారు.

బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టిన వివిధ బిల్లులపై ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్య నిషేధంతో పాటు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి ఉందన్నారు.

పాదయాత్ర సందర్భంగా తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఎలాంటి వాగ్దానాలు చేశారో… వాటన్నిటినీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నారని అంబటి రాంబాబు చెప్పారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వివిధ బిల్లులపై చర్చ జరగకూడదనే ఆలోచనతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ శాసనసభలో రాద్ధాంతం సృష్టిస్తోందని ఆయన మండిపడ్డారు.

మహిళలకు పింఛను ఇవ్వడంపై సీఎం జగన్మోహన్ రెడ్డికి స్పష్టత ఉందని, ఆ అంశంపై ప్రతిపక్షానికే క్లారిటీ లేదని అంబటి రాంబాబు అన్నారు.

“మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరు మారాలి. ప్రతిపక్ష నేతగా మంచి పాత్ర పోషించాలి. అంతేగాని చర్చలో పాల్గొనకుండా పారిపోవడం సభ్యత కాదు” అని అంబటి రాంబాబు స్పష్టం చేశారు.

First Published:  24 July 2019 11:10 PM GMT
Next Story