Telugu Global
NEWS

భూయజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు

కొత్తగా తెచ్చిన కౌలు రైతు బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన బోస్… కౌలు రైతులు రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారన్నారు. వీరి పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. కోస్తా జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారని మంత్రి వివరించారు. భూయజమానులు పట్టణాలకు తరలిపోగా… ఏమీ లేని వారు ఆ భూములను కౌలు తీసుకుని పనిచేసుకుంటున్నారని చెప్పారు. కౌలుదారుడు అని ఒప్పుకుంటే […]

భూయజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు
X

కొత్తగా తెచ్చిన కౌలు రైతు బిల్లును ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా మాట్లాడిన బోస్… కౌలు రైతులు రాష్ట్రంలో 15 లక్షల మంది ఉన్నారన్నారు. వీరి పరిస్థితి చాలా దయనీయంగా ఉందన్నారు. కోస్తా జిల్లాల్లో వీరు ఎక్కువగా ఉన్నారని మంత్రి వివరించారు.

భూయజమానులు పట్టణాలకు తరలిపోగా… ఏమీ లేని వారు ఆ భూములను కౌలు తీసుకుని పనిచేసుకుంటున్నారని చెప్పారు. కౌలుదారుడు అని ఒప్పుకుంటే భూమి హక్కుకు ఎదైనా ఇబ్బంది వస్తుందేమోనన్న భయం భూ యజమానుల్లో ఉందన్నారు. దీని వల్లే కౌలు రైతులకు సాయం చేయడం ప్రభుత్వాలకు ఇబ్బందిగా మారిందన్నారు.

ఈ ఇబ్బందులను అధిగమించి కౌలు రైతులకు సాయం చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త చట్టం తెస్తున్నామన్నారు. కొత్త చట్టం ద్వారా భూయజమాని హక్కులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.

కేవలం 11 నెలలు మాత్రమే భూమిని సాగు చేస్తున్న కౌలు రైతుకు పంట మీద మాత్రమే హక్కు ఉంటుందన్నారు. పంటపై కౌలు రైతులు తీసుకునే అప్పులకు… భూయజమానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. సాగు చేసే పంటపై మాత్రమే కౌలు రైతులకు హక్కు ఉంటుందన్నారు.

కాబట్టి భూ యజమానులు ధైర్యంగా ఉండవచ్చన్నారు. భూ రికార్డుల్లో ఎక్కడా కూడా కౌలు రైతు పేరు ఉండదని… కాబట్టి భూ యజమానికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రైతు భరోసా కింద ఇచ్చే సొమ్ము కౌలుదారుడితో పాటు, భూయాజమానికి కూడా ఇస్తున్నామని… కౌలు రైతుకు, భూ యజమానికి ఇద్దరికీ లాభం చేయాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

First Published:  25 July 2019 10:33 AM GMT
Next Story