Telugu Global
Cinema & Entertainment

స్టైలిష్ యాక్షన్ పోస్టర్ తో... సాహో టీమ్

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా సాహో. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది… కానీ క్రమక్రమం గా సినిమా డిలే అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు… కానీ పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఈ సినిమా ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుందని కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది ఈ సినిమా యూనిట్. ఈ ఆలస్యానికి కారణం గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ […]

స్టైలిష్ యాక్షన్ పోస్టర్ తో... సాహో టీమ్
X

బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా సాహో. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది… కానీ క్రమక్రమం గా సినిమా డిలే అవుతూ వచ్చింది.

అయితే ఈ సినిమా ఆగస్టు 15 న విడుదల అవుతుంది అని అందరూ అనుకున్నారు… కానీ పోస్ట్ పోన్ చేశారు. చివరకు ఈ సినిమా ఆగస్టు 30 న ప్రేక్షకుల ముందుకు రానుందని కొద్దిరోజుల క్రితమే ప్రకటించింది ఈ సినిమా యూనిట్.

ఈ ఆలస్యానికి కారణం గ్రాఫిక్ వర్క్ కంప్లీట్ కాకపోవడమే కారణం అని ప్రకటన కూడా చేశారు. అయితే ఇదే సమయంలో గ్రాఫిక్ వర్క్ తో పాటు…. సినిమా ప్రమోషన్స్ కూడా ఊపందుకున్నాయి. ఈ సినిమా ఎలా వచ్చింది అనే విషయం పక్కన పెడితే సినిమా మీద బజ్ మాత్రం ఒక రేంజ్ లో క్రియేట్ అవుతుంది. ఈ మధ్యే వచ్చిన ఒక పోస్టర్ ఎంత మంచి పాజిటివ్ రెస్పాన్స్ జెనరేట్ చేసిందో తెలిసిందే.

ఇప్పుడు కొత్తగా ఒక స్టైలిష్ యాక్షన్ పోస్టర్ ని ఈ రోజు చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్ లో ప్రభాస్, శ్రద్ధ ఇద్దరూ విలన్ల తో పోరాడుతున్న పోస్టర్. ఇప్పటి వరకు టీమ్ నుంచి వచ్చిన పోస్టర్స్ లో…. ఇది కూడా మరో వైవిధ్యమైన పోస్టర్.

First Published:  25 July 2019 3:51 AM GMT
Next Story