Telugu Global
NEWS

చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ కొనసాగింపు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబుకు ఇప్పటికీ మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కొనసాగించాలని అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. ఇటీవల దేశంలోని వీఐపీల భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష అనంతరం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, మీరా కుమార్‌ తదితరుల భద్రతను తగ్గించింది. […]

చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ కొనసాగింపు
X

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి ఎన్‌ఎస్‌జీ భద్రత కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. చంద్రబాబుకు ఇప్పటికీ మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో జెడ్‌ ప్లస్‌ కేటగిరి భద్రతను కొనసాగించాలని అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది.

ఇటీవల దేశంలోని వీఐపీల భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ సమీక్ష అనంతరం యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, మీరా కుమార్‌ తదితరుల భద్రతను తగ్గించింది. కానీ చంద్రబాబు విషయంలో మాత్రం జెడ్‌ప్లస్ కేటగిరి కొనసాగించాలని నిర్ణయించింది.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులను భారీ స్థాయిలో ఎన్‌కౌంటర్లు చేయడం, 2003లో అలిపిరి దాడి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు… ఇటీవల కేంద్ర, రాష్ట్ర ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా చంద్రబాబుకు ఎన్‌ఎస్‌జీ కమాండోలతో భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.

First Published:  25 July 2019 11:34 PM GMT
Next Story