Telugu Global
Cinema & Entertainment

ఎక్స్ క్లూజివ్.. ఆర్-ఆర్-ఆర్ అప్ డేట్

ఆర్-ఆర్-ఆర్ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ బయటకొచ్చింది. ఈ మూవీ కోసం ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకంగా 35 రోజుల షెడ్యూల్ ఇది. వచ్చేనెలలో తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు. నిజానికి పూణెలో నిర్వహించాల్సిన షూటింగ్ ఇది. ఈ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా గతంలో పూణె వెళ్లింది కూడా. కానీ జిమ్ లో కసరత్తులు […]

ఎక్స్ క్లూజివ్.. ఆర్-ఆర్-ఆర్ అప్ డేట్
X

ఆర్-ఆర్-ఆర్ సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ బయటకొచ్చింది. ఈ మూవీ కోసం ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఏకంగా 35 రోజుల షెడ్యూల్ ఇది. వచ్చేనెలలో తమిళనాడులోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ షెడ్యూల్ లో పాల్గొంటారు.

నిజానికి పూణెలో నిర్వహించాల్సిన షూటింగ్ ఇది. ఈ షెడ్యూల్ కోసం యూనిట్ అంతా గతంలో పూణె వెళ్లింది కూడా. కానీ జిమ్ లో కసరత్తులు చేస్తూ చరణ్ గాయపడ్డంతో ఆ షెడ్యూల్ మొత్తం రద్దయింది. ఈమధ్యే కొత్త షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే స్టార్ట్ చేశారు.

మరోసారి పూణె షెడ్యూల్ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. కానీ సెంటిమెంట్ ప్రకారం ఇక పూణె వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఆ షెడ్యూల్ లో తీయాల్సిన సన్నివేశాల్ని తమిళనాడులో ప్లాన్ చేశారు. ఈ భారీ షెడ్యూల్ లో ఎన్టీఆర్ 23 కాల్షీట్లు వాడుతున్నారు. మిగిలిన రోజుల్లో ఎన్టీఆర్, చరణ్ మధ్య కాంబినేషన్ సీన్లు తీయబోతున్నారు.

తమిళనాడు షెడ్యూల్ కూడా పూర్తయిన తర్వాత ఎన్టీఆర్ సరసన నటించనున్న విదేశీ భామను ఎంపిక చేస్తారు. మరోవైపు కీరవాణి ఈ సినిమా కోసం 3 పాటల్ని రెడీ చేశాడు. వీటిలో ఓ పాటకు సంబంధించిన కొన్ని సీన్లను తమిళనాడు షెడ్యూల్ లో తీయబోతున్నారు.

First Published:  26 July 2019 5:39 AM GMT
Next Story