Telugu Global
Cinema & Entertainment

'కృష్ణ గాడి' కి.... పెన్సిల్ పార్థసారథి కి మధ్య పోలికలు

ఈ మధ్యనే ‘జెర్సీ’ అనే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని ఆ సినిమాలో తన నటనతో అందరి మనసు గెలుచుకున్నాడు. ఇప్పుడు జోనర్ మార్చి ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు నాని. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరించాలని భావిస్తున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. ఒక పవర్ ఫుల్ విలన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని […]

కృష్ణ గాడి కి.... పెన్సిల్ పార్థసారథి కి మధ్య పోలికలు
X

ఈ మధ్యనే ‘జెర్సీ’ అనే ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన న్యాచురల్ స్టార్ నాని ఆ సినిమాలో తన నటనతో అందరి మనసు గెలుచుకున్నాడు.

ఇప్పుడు జోనర్ మార్చి ‘గ్యాంగ్ లీడర్’ అనే సినిమాతో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు నాని. ఈ సినిమాతో ప్రేక్షకుల్ని కచ్చితంగా అలరించాలని భావిస్తున్నాడు.

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ ఈ మధ్యనే విడుదలైంది. ఒక పవర్ ఫుల్ విలన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్న ఐదుగురు కథ ఇది. కథాంశం సీరియస్ గా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే మాత్రం వినోదాత్మకంగా ఉంటుందని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

పెన్సిల్ పార్థసారధి గా నాని ఈ టీజర్ లో కనిపించాడు. టీజర్ చూస్తే కొంచెం ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమా ఛాయలు కనిపిస్తున్నాయి. లుక్ పరంగా కూడా రెండు సినిమాలలోనూ పక్కింటి అబ్బాయి తరహా పాత్ర పోషించిన నాని ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’ సినిమాలో కూడా ముగ్గురు పిల్లల్ని వెంటేసుకుని రోడ్ జర్నీ చేస్తాడు.

కథ పక్కన పెడితే స్క్రీన్ ప్లే కొంచెం రెండు సినిమాల్లోనూ ఒకేలా ఉంటుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు.

అయితే విక్రమ్ కుమార్ తన కెరియర్ లో ఇప్పటిదాకా లేనటువంటి విధంగా ఎంటర్ టైనింగ్ సినిమాతో రాబోతున్నాడట. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతోంది.

First Published:  26 July 2019 12:47 AM GMT
Next Story