కోహ్లి, రొహిత్‌ మధ్య విభేదాలు…

టీమిండియాలో అంతర్గత పోరు కొనసాగుతోంది. ఇప్పటికే టీమిండియా రెండుగా చీలిపోయిందన్న వార్తలొస్తున్నాయి. కెప్టెన్ కోహ్లి ఒక గ్రూప్… రోహిత్ శర్మ మరో గ్రూప్‌గా చీలిపోయారన్న వార్తలు షికారు చేస్తున్నాయి.

వరల్డ్ కప్ సందర్భంగా ఈ చీలిక మరింత పెరిగింది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లి, అతడి భార్య అనుష్క శర్మను ఇంతకాలం ఫాలో అవుతూ వచ్చిన రోహిత్ శర్మ… ఇప్పుడు వారిద్దరని అన్‌ఫాలో చేశారనే అంశం టీమిండియాను కలవరపాటుకు గురి చేస్తోంది.

వీరి మధ్య అంతర్గతంగా పెద్ద ఆగాధమే లేకుంటే ఇలా కోహ్లి, అనుష్క శర్మను రోహిత్ శర్మ ఎందుకు అన్‌ఫాలో చేస్తారన్న దానిపై చర్చ నడుస్తోంది. ఈ విషయం మరింత ముదిరే అవకాశం ఉండడంతో తిరిగి కోహ్లిని రోహిత్ శర్మ ఫాలో అవుతారేమో చూడాలి. విరాట్ కోహ్లి మాత్రం ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో రోహిత్ శర్మను ఫాలో అవుతున్నాడు.