బిగ్ బాస్ లొల్లి…. మహేష్ ను కొట్టబోయిన వరుణ్ సందేశ్

బిగ్ బాస్ 3 సీజన్ లో మొదటి వారంలోనే వివాదాలు చుట్టుముడుతున్నాయి. మొదటి వారంలో అందరూ అర్థం చేసుకొని సాఫీగా సాగుతారని అనుకుంటే నాలుగో రోజుకే కంటెస్టెంట్ల మధ్య గొడవలు, అలకలు ఏకంగా కొట్టుకునే దాకా పరిస్థితి వెళ్లింది.

తాజాగా గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. యంగ్ కమెడియన్ మహేష్ విట్టా వ్యవహార శైలిపై ఇంట్లో కంప్లైట్లు పెరిగిపోతున్నాయి. ఇంట్లో సరదాగా ఉండకుండా సీరియస్ గా ఉంటూ ఎవరైనా కామెడీ చేస్తే వారిపైన సీరియస్ అవుతున్నాడు మహేష్ విట్టా.

గురువారం ఎపిసోడ్ లో హీరో వరుణ్ సందేశ్ భార్య పట్ల దురుసుగా ప్రవర్తించాడు మహేష్ విట్టా. దీనిపై ఆమె నిలదీసే సరికి పక్కనే ఉన్న వరుణ్ సందేశ్ కూడా ఉవ్వెత్తున లేచాడు. తన భార్యనంటావా అంటూ కొట్టబోయాడు. మిగతా సభ్యులందరూ ఆపి వరుణ్ ను పక్కకు తీసుకెళ్లారు.

ఇక మహేష్.. వరుణ్ భార్య రితిక పట్ల దురుసుగా, ఏకవచనంతో తిట్టడం దుమారం రేపింది. ఆ వ్యాఖ్యలపై రితిక కూడా ఫైర్ అయ్యింది. మాట్లాడడం ముందు నేర్చుకో అంటూ మహేష్ ను తిట్టి పోసింది. ఇలా మహేష్ విట్టా నోటి దురుసుతో బిగ్ బాస్ గురువారం హీటెక్కింది.