Telugu Global
NEWS

ఆయన మంచివారు.... అనవసరంగా విభేదాలు తెచ్చారు....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగు రాష్ట్ర్రమైన మరో తెలుగు రాష్ట్ర్రం తెలంగాణతో సఖ్యత అవసరం అని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. “పొరుగు రాష్ట్ర్రం ముఖ్యమంత్రిని నేను పొగడడం లేదు. ఆయన మంచివారు. ఆ రాష్ట్ర్రంతో స్నేహంగా ఉంటే నీటి వాటాలలో మనకు అన్యాయం జరగదు” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో పంట సాగుదారుల హక్కుల బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నీటి పారుదల అంశంపై […]

ఆయన మంచివారు.... అనవసరంగా విభేదాలు తెచ్చారు....
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొరుగు రాష్ట్ర్రమైన మరో తెలుగు రాష్ట్ర్రం తెలంగాణతో సఖ్యత అవసరం అని ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

“పొరుగు రాష్ట్ర్రం ముఖ్యమంత్రిని నేను పొగడడం లేదు. ఆయన మంచివారు. ఆ రాష్ట్ర్రంతో స్నేహంగా ఉంటే నీటి వాటాలలో మనకు అన్యాయం జరగదు” అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు.

గురువారం శాసనసభలో పంట సాగుదారుల హక్కుల బిల్లుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. నీటి పారుదల అంశంపై పొరుగు రాష్ట్రంతో సఖ్యత అవసరం అని సీఎం అన్నారు.

రెండు తెలుగు రాష్ట్ర్రాలకు చెందిన వారు ఒకరితో ఒకరు సఖ్యంగా ఉంటే తెలుగు ప్రజలకు మేలు జరుగుతుందని, అందుకోసమే తాను తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావుతో సఖ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు.

మహారాష్ట్ర్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతున్నాయని, దాని వల్ల దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ కు నీరు ఎలా వస్తుందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రానికి గోదావరి నీటిలో కేవలం 12శాతం మాత్రమే వస్తున్నాయని, వాటిని వినియోగించుకోవాల్సి ఉందని చెప్పారు.

శబరి సంగమం తర్వాత తెలుగు రాష్టాలకు 3,082 టీఎంసీల నీరు వస్తోందని, అయితే ఆంధ్రప్రదేశ్ కు శబరి నుంచి వచ్చే నీరు కేవలం ఐదారు వందల టీఎంసీలు మాత్రమేనని, మిగిలిన 2,500 టీఎంసీల నీరు తెలంగాణ దాటిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ కు వస్తాయనే వాస్తవాలను గ్రహించాలని ప్రతిపక్షాలకు సూచించారు.

“పైన ప్రాజెక్టులు కడితే మనకు నీళ్లు ఎలా వస్తాయి” అని సీఎం ప్రశ్నించారు. రాష్ట్ర్రంలో నానాటికి నీటి వినియోగం పెరుతోందని, అయితే అందుకు అనుగుణంగా నీటి లభ్యత మాత్రం లేదని అన్నారు.

దీనిని అధిగమించేందుకే పొరుగు రాష్ట్ర్రంతో సఖ్యంగా ఉన్నామని చెప్పారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అనవసరంగా పొరుగు రాష్ట్ర్రంతో విభేదాలు తెచ్చుకుందని, దీని వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

First Published:  25 July 2019 8:51 PM GMT
Next Story