Telugu Global
Cinema & Entertainment

బాలయ్య సరసన .... భూమిక

బాలయ్య కొత్త సినిమా కోసం ఇప్పటికే ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు. ఆమె పేరు భూమిక. అవును.. ఇన్నేళ్ల తర్వాత బాలయ్య-భూమిక కాంబోలో సినిమా రాబోతోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న కేఎస్ రవికుమార్ సినిమాలో బాలయ్య సరసన భూమిక సెకెండ్ హీరోయిన్ గా నటించబోతోంది. బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు క్రాంతి అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాల్ […]

బాలయ్య సరసన .... భూమిక
X

బాలయ్య కొత్త సినిమా కోసం ఇప్పటికే ఓ హీరోయిన్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఇప్పుడు మరో హీరోయిన్ ను కూడా ఎంపిక చేశారు. ఆమె పేరు భూమిక. అవును.. ఇన్నేళ్ల తర్వాత బాలయ్య-భూమిక కాంబోలో సినిమా రాబోతోంది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న కేఎస్ రవికుమార్ సినిమాలో బాలయ్య సరసన భూమిక సెకెండ్ హీరోయిన్ గా నటించబోతోంది.

బాలయ్య-కేఎస్ రవికుమార్ సినిమాకు క్రాంతి అనే టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ను తీసుకున్నారు. ఇక సినిమాలో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో హీరోయిన్ గా భూమిక నటించబోతోంది. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు.

నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కథలో కొన్ని మార్పులు సూచించాడు బాలయ్య. పైగా సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం హీరో ఫిక్స్ చేసి ముహూర్తం కూడా చాలా దూరముంది. అందుకే ఈ మూవీని సంక్రాంతి బరి నుంచి తప్పించారు.

First Published:  27 July 2019 5:11 AM GMT
Next Story