Telugu Global
Cinema & Entertainment

'డియర్ కామ్రేడ్' కాదట.... 'డియర్ లిల్లి' అయితే....

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. అయితే ఈ సినిమా కథను విజయ్ దేవరకొండ కి ‘పెళ్లిచూపులు’ విడుదల కాకముందే చెప్పారట. కథ బాగా నచ్చడంతో విజయ్ దేవరకొండ అప్పుడే ఈ సినిమాకి ఓకే కూడా చెప్పాడట. కానీ తర్వాత ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయిపోవడంతో విజయ్ దేవరకొండ ఇమేజ్ […]

డియర్ కామ్రేడ్ కాదట.... డియర్ లిల్లి అయితే....
X

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ హీరోగా భరత్ కమ్మ దర్శకత్వంలో విడుదలైన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

అయితే ఈ సినిమా కథను విజయ్ దేవరకొండ కి ‘పెళ్లిచూపులు’ విడుదల కాకముందే చెప్పారట. కథ బాగా నచ్చడంతో విజయ్ దేవరకొండ అప్పుడే ఈ సినిమాకి ఓకే కూడా చెప్పాడట.

కానీ తర్వాత ‘పెళ్లి చూపులు’, ‘అర్జున్ రెడ్డి’ వంటి సినిమాలు సూపర్ హిట్ అయిపోవడంతో విజయ్ దేవరకొండ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. కాబట్టి తన ఇమేజ్ కి సెట్ అయ్యేలాగా భరత్ కమ్మ విజయ్ దేవరకొండ వద్దకి రెండు వేరే స్క్రిప్టులను తీసుకు వెళ్లారట.

కానీ విజయ్ దేవరకొండ మాత్రం ‘డియర్ కామ్రేడ్’ సినిమానే ఎంపిక చేద్దామని చెప్పాడట. నిజానికి ఈ సినిమా కథ ప్రకారం హీరోయిన్ పాత్ర కి ఎక్కువ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉంటుంది. అయినప్పటికీ విజయ్ దేవరకొండ స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చెప్పి ఇదే కథను ఓకే చేశాడట.

అలా ‘డియర్ కామ్రేడ్’ సినిమా సెట్స్ పైకి వెళ్లిందట. ఈ మధ్యనే విడుదలైన ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కూడా సినిమాకి ‘డియర్ కామ్రేడ్’ అనే టైటిల్ కంటే ‘డియర్ లిల్లి’ అనే టైటిల్ పెట్టి ఉంటే ఇంకా బాగా సెట్ అయ్యేది అని, లిల్లి పాత్రలో రష్మిక మందన్న బెస్ట్ పర్ఫార్మెన్స్ కనబరిచిందని కామెంట్లు చేస్తున్నారు.

First Published:  27 July 2019 4:43 AM GMT
Next Story