దుబాయ్‌లో శివాజీ అరెస్టు

దుబాయ్‌లో కమెడియన్, గరుడపురాణం శివాజీని అరెస్టు చేశారు. అలందా మీడియా కేసులో ఇప్ప‌టికే శివాజీపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.

తాజాగా దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఇమ్మిగ్రేష‌న్ అధికారులు ప‌ట్టుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉండ‌డంతో తిరిగి ఇండియాకు పంపించారు.

ఇప్ప‌టికే శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఒక‌సారి శివాజీని పట్టుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉండ‌డంతో అప్పుడు తిరిగి పంపించారు.

తాజాగా అమెరికా వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేయ‌డంతో దుబాయ్‌లో ప‌ట్టుకున్నారు. ఇప్ప‌టికే శివాజీ పై ఓ కేసు న‌డుస్తోంది. అయితే శివాజీ ఎందుకు పారిపోయే ప్రయ‌త్నం చేశాడ‌నేది సంచ‌ల‌నంగా మారింది.