Telugu Global
NEWS

కపిల్ అండ్ కో చేతిలో భారత చీఫ్ కోచ్ ఎంపిక

ఆగస్టు 13, 14 తేదీలలో చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు రవి శాస్త్రికే మళ్లీ చీఫ్ కోచ్ గా అవకాశం? భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రవి శాస్త్ర్రి పదవీకాలం ముగియటంతోనే.. సరికొత్త శిక్షకుడి కోసం బీసీసీఐ పాలకమండలి అన్వేషణ ప్రారంభించింది. రవి శాస్త్రి వారసుడి కోసం దరఖాస్తులు పంపుకోవాలంటూ ఓ ప్రకటన సైతం విడుదల చేసింది. ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయల కాంట్రాక్టుతో గత రెండేళ్లుగా భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా సేవలు అందిస్తూ వచ్చిన […]

కపిల్ అండ్ కో చేతిలో భారత చీఫ్ కోచ్ ఎంపిక
X
  • ఆగస్టు 13, 14 తేదీలలో చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు
  • రవి శాస్త్రికే మళ్లీ చీఫ్ కోచ్ గా అవకాశం?

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రవి శాస్త్ర్రి పదవీకాలం ముగియటంతోనే.. సరికొత్త శిక్షకుడి కోసం బీసీసీఐ పాలకమండలి అన్వేషణ ప్రారంభించింది.

రవి శాస్త్రి వారసుడి కోసం దరఖాస్తులు పంపుకోవాలంటూ ఓ ప్రకటన సైతం విడుదల చేసింది.

ఏడాదికి ఏడున్నర కోట్ల రూపాయల కాంట్రాక్టుతో గత రెండేళ్లుగా భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా సేవలు అందిస్తూ వచ్చిన రవిశాస్త్రి సైతం.. మరోసారి పోటీలో నిలువనున్నాడు.

ఆగస్టు 13, 14 తేదీలలో చీఫ్ కోచ్ ఇంటర్వ్యూలు నిర్వహించాలని బీసీసీఐ పాలకమండలి ఆదేశించింది. అంతేకాదు…చీఫ్ కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను..కపిల్ దేవ్, అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీకి అప్పజెప్పింది.

గతంలో రవి శాస్త్రిని ఎంపిక చేసిన సచిన్, లక్ష్మణ్, సౌరవ్ గంగూలీలతో కూడిన ఎంపిక సంఘాన్ని…పరస్పర విరుద్ధ ప్రయోజనాల కారణంతో బాధ్యతల నుంచి తప్పించారు.

రవి శాస్త్రికే మళ్లీ అవకాశం?

భారత క్రికెట్ ప్రధాన శిక్షకుడిగా మరోసారి రవిశాస్త్రి ఎంపిక కావటానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రవి శాస్త్రినే కోచ్ గా కొనసాగించాలని… కెప్టెన్ విరాట్ కొహ్లీ సైతం పట్టుపడుతున్నాడు.

ప్రపంచకప్ సెమీఫైనల్లో ఓటమి మినహా మిగిలిన టోర్నీలు, సిరీస్ ల్లో భారత్ ను విజయవంతమైన జట్టుగా నిలిపిన ఘనత రవిశాస్త్రికి ఉంది.

ఫీల్డింగ్ కోచ్ రేస్ లో జాంటీ రోడ్స్…

చీఫ్ కోచ్ తో పాటు…బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కో్చ్ లు, ఇతర సహాయసిబ్బందిని సైతం బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఫీల్డింగ్ కోచ్ స్థానం కోసం.. సౌతాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ ఇప్పటికే తన దరఖాస్తును బీసీసీఐకి పంపాడు.

బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్ ను కొనసాగించే అవకాశాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. నంబర్ ఫోర్ స్థానం కోసం ఓ సమర్థుడైన బ్యాట్స్ మన్ ను ఎంపిక చేయడంలో సంజయ్ బంగర్ దారుణంగా విఫలం కావడం …అతని పాలిట శాపంగా మారింది.

బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్ కొనసాగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

First Published:  27 July 2019 2:00 AM GMT
Next Story