Telugu Global
NEWS

ఐర్లాండ్ 38 పరుగులకే ప్యాకప్

లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ భారీవిజయం 15.4 ఓవర్లలోనే ఐర్లాండ్ టపటపా టెస్ట్ క్రికెట్ పసికూన ఐర్లాండ్ తో…క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగురోజుల టెస్ట్ మూడో రోజు ఆటలోనే ఆతిథ్య ఇంగ్లండ్ 143 పరుగుల భారీ విజయంతో… యాషెస్ సిరీస్ సమరానికి సిద్ధమయ్యింది. లార్డ్స్ గ్రీన్ టాప్ వికెట్ పై ఫాస్ట్ బౌలర్ల హవాతో సాగిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్ లో..సంచలన విజయం సొంతం చేసుకోవాలంటే… 182 పరుగులు సాధించాల్సిన ఐర్లాండ్…కేవలం 15.4 ఓవర్ల ఆటలోనే పేకమేడలా కూలిపోయింది. […]

ఐర్లాండ్ 38 పరుగులకే ప్యాకప్
X
  • లార్డ్స్ టెస్టులో ఇంగ్లండ్ భారీవిజయం
  • 15.4 ఓవర్లలోనే ఐర్లాండ్ టపటపా

టెస్ట్ క్రికెట్ పసికూన ఐర్లాండ్ తో…క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరిగిన నాలుగురోజుల టెస్ట్ మూడో రోజు ఆటలోనే ఆతిథ్య ఇంగ్లండ్ 143 పరుగుల భారీ విజయంతో… యాషెస్ సిరీస్ సమరానికి సిద్ధమయ్యింది.

లార్డ్స్ గ్రీన్ టాప్ వికెట్ పై ఫాస్ట్ బౌలర్ల హవాతో సాగిన ఈ లోస్కోరింగ్ మ్యాచ్ లో..సంచలన విజయం సొంతం చేసుకోవాలంటే… 182 పరుగులు సాధించాల్సిన ఐర్లాండ్…కేవలం 15.4 ఓవర్ల ఆటలోనే పేకమేడలా కూలిపోయింది.

క్రిస్ వోక్స్ విశ్వరూపం…

టెస్ట్ క్రికెట్లో కేవలం రెండుమ్యాచ్ ల అనుభవం మాత్రమే ఉన్న పసికూన ఐర్లాండ్… సంచలన విజయం సాధించడానికి అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది.

అనుభవం లేమితో కేవలం…15.4 ఓవర్లలో 38 పరుగులకే కుప్పకూలింది. ఐర్లాండ్ టాపార్డర్లో ఓపెనర్ మెక్ కోలుమ్ ఒక్కడే రెండంకెల స్కోరు సాధించగలిగాడు.

మిగిలిన ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే వెనుదిరిగారు. ఇంగ్లండ్ ఓపెనింగ్ బౌలర్లు క్రిస్ వోక్స్, స్టువర్ట్ బ్రాడ్ ల ధాటికి ఐరిష్ బ్యాట్స్ మన్ పిట్టల్లా రాలిపోయారు.

క్రిస్ వోక్స్ 7.4 ఓవర్లలో 17 పరుగులిచ్చి 6 వికెట్లు, బ్రాడ్ 8 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ విజయంలో ప్రధానపాత్ర వహించిన నైట్ వాచ్ మన్ కమ్ ఓపెనర్ జాక్ లీచ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

డుటెస్టుల్లో మూడు పరాజయాలు..

గత ఏడాది అప్ఘనిస్థాన్ తో కలసి టెస్ట్ హోదా పొందిన ఐర్లాండ్ ..ప్రస్తుత లార్డ్స్ టెస్ట్ తో సహా ఆడిన మొత్తం మూడుకు మూడుటెస్టుల్లోనూ పరాజయాలు పొందటం విశేషం.

అరంగేట్రం టెస్టులో పాకిస్థాన్, రెండోటెస్టులో అప్ఘనిస్థాన్ చేతిలో ఓటమి పొందిన ఐర్లాండ్ కు…ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో ఘోరపరాజయం తప్పలేదు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి తక్కువ స్కోరుకు ఆలౌటైన రికార్డు న్యూజిలాండ్ పేరుతో ఉంది.

1955 లో ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 26 పరుగులకే కుప్పకూలింది. నాటినుంచి నేటి వరకూ ఆ స్కోరే అత్యల్పస్కోరుగా రికార్డుల్లో నిలిచింది.

మరోవైపు…182 పరుగుల అతితక్కువ లక్ష్యాన్ని ఇంగ్లండ్ విజయవంతంగా నిలుపుకోగలిగింది. 1998లో మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ లో.. అతితక్కువ లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకొన్న ఇంగ్లండ్ ఆ తర్వాత 182 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోడం ఇదే మొదటిసారి.

First Published:  26 July 2019 8:30 PM GMT
Next Story