Telugu Global
National

మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ ప్ర‌యాణికులు సుర‌క్షితం

మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ ప‌ట్టాల మీదే నిలిచిపోయింది. వరదల కారణంగా ముంబ‌యి-కొల్హాపూర్ మ‌ధ్య న‌డిచే ఈ ట్రైన్ వరదల్లో చిక్కుకుంది. దీంతో రెండు మిల‌ట‌రీ హెలికాప్ట‌ర్లు, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన ఆరు బోట్ల‌తో వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. ముంబ‌యి, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద నీరు పెరిగిపోయింది. ముంబ‌యి-కొల్హాపూర్ మ‌ధ్య న‌డిచే మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ ఈ వ‌ర‌ద నీటి దెబ్బ‌కు ప‌ట్టాల మీదే నిలిచిపోయింది. రైలు […]

మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ ప్ర‌యాణికులు సుర‌క్షితం
X

మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ ప‌ట్టాల మీదే నిలిచిపోయింది. వరదల కారణంగా ముంబ‌యి-కొల్హాపూర్ మ‌ధ్య న‌డిచే ఈ ట్రైన్ వరదల్లో చిక్కుకుంది.

దీంతో రెండు మిల‌ట‌రీ హెలికాప్ట‌ర్లు, నేష‌న‌ల్ డిజాస్ట‌ర్ రెస్పాన్స్ ఫోర్స్ కి చెందిన ఆరు బోట్ల‌తో వ‌ర‌ద నీటిలో చిక్కుకున్న ప్ర‌యాణికుల‌ను ర‌క్షించారు. ముంబ‌యి, దాని చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భారీ వ‌ర్షాల కార‌ణంగా వ‌ర‌ద నీరు పెరిగిపోయింది.

ముంబ‌యి-కొల్హాపూర్ మ‌ధ్య న‌డిచే మ‌హాల‌క్ష్మి ఎక్స్ ప్రెస్ ఈ వ‌ర‌ద నీటి దెబ్బ‌కు ప‌ట్టాల మీదే నిలిచిపోయింది. రైలు దిగితే వ‌ర‌ద నీటిలో కొట్టుకుపోతార‌ని, అందులో ఉంటేనే క్షేమం అని రైల్వే అధికార్లు ప్ర‌యాణికుల‌కు స‌ల‌హా ఇచ్చారు.

దీంతో ప్ర‌యాణికులు సోష‌ల్ మీడియా ద్వారా తాము శుక్ర‌వారం రాత్రి నుంచి తిండి, నీరు లేకుండా వ‌ర‌ద నీటి మ‌ధ్య‌లో ఉండిపోయామ‌ని, ర‌క్షించాల‌ని ప్ర‌భుత్వానికి విన్న‌వించుకుంటూ ఆర్త‌నాదాలు చేశారు.

దీంతో అధికార్లు రంగంలోకి దిగి థానే జిల్లా వ‌ద్ద ఈ ట్రైన్ లో ఉన్న సుమారు 700 మంది ప్ర‌యాణికుల‌ను ర‌క్షించ‌డానికి చ‌ర్య‌లు తీసుకున్నారు. శ‌నివారం రోజంతా జ‌రిగిన త‌ర‌లింపు ప‌నులు సాయంత్రానికి ముగిశాయి. 9మంది గ‌ర్భిణీ స్త్రీల‌తో స‌హా మొత్తం ప్ర‌యాణికుల‌ను సుర‌క్షితంగా త‌ర‌లించామ‌ని రైల్వే అధికార్లు ప్ర‌క‌టించారు.

First Published:  27 July 2019 11:15 AM GMT
Next Story