Telugu Global
Cinema & Entertainment

పూజా హెగ్డేను పరిచయం చేసిన దర్శకుడు

చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన హరీష్ శంకర్.. సినిమాల విషయంలో గ్యాప్ ఇచ్చినా హీరోయిన్ విషయంలో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం చేస్తున్న వాల్మీకి కోసం కూడా పూజాను పట్టుబట్టి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా హీరోయిన్ ను సంబంధించిన లుక్ ను రివీల్ చేశాడు ఈ డైరక్టర్. వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ లవర్ గా కనిపించనుంది పూజా […]

పూజా హెగ్డేను పరిచయం చేసిన దర్శకుడు
X

చాన్నాళ్ల తర్వాత మెగాఫోన్ పట్టిన హరీష్ శంకర్.. సినిమాల విషయంలో గ్యాప్ ఇచ్చినా హీరోయిన్ విషయంలో మాత్రం అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. దువ్వాడ జగన్నాథమ్ సినిమా కోసం పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్న ఈ దర్శకుడు, ప్రస్తుతం చేస్తున్న వాల్మీకి కోసం కూడా పూజాను పట్టుబట్టి తీసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడా హీరోయిన్ ను సంబంధించిన లుక్ ను రివీల్ చేశాడు ఈ డైరక్టర్.

వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ లవర్ గా కనిపించనుంది పూజా హెగ్డే. పల్లెటూరి అమ్మాయి గెటప్ లో ఉన్న పూజా హెగ్టే ను వెనక నుంచి చూపిస్తూ ఓ స్టిల్ రిలీజ్ చేశాడు హరీష్ శంకర్. ఈ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్నాడు. ఆమెకు లవర్ గా పూజా హెగ్డే కనిపించనుంది. సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో భాగంగా పూజా హెగ్డే రాబోతోంది.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను జిగర్తాండా అనే తమిళ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు. తమిళ వెర్షన్ లో సిద్దార్థ్ పోషించిన హీరో పాత్రను తెలుగులో అధర్వ పోషిస్తున్నాడు. ఇక తమిళ్ లో బాబి సిన్హా పోషించిన నెగెటివ్ పాత్రను వరుణ్ తేజ్ పోషిస్తున్నాడు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  27 July 2019 5:16 AM GMT
Next Story