Telugu Global
Cinema & Entertainment

మళ్లీ వాయిదా పడిన సంపూర్ణేష్ బాబు సినిమా

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మారిన సంపూర్ణేష్ బాబు కెరియర్ లో పెద్దగా హిట్ సినిమాలు అంటూ ఏమీ లేవు. 2016లో ‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్’ అనే సినిమాలో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత వెండితెరపై మళ్ళీ కనిపించింది లేదు. అయితే బుల్లితెరపై బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా మారాడు…. కానీ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఇక సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా షూటింగ్ ఎప్పుడో […]

మళ్లీ వాయిదా పడిన సంపూర్ణేష్ బాబు సినిమా
X

‘హృదయ కాలేయం’ సినిమాతో హీరోగా మారిన సంపూర్ణేష్ బాబు కెరియర్ లో పెద్దగా హిట్ సినిమాలు అంటూ ఏమీ లేవు. 2016లో ‘భద్రం బి కేర్ ఫుల్ బ్రదర్’ అనే సినిమాలో కనిపించిన సంపూర్ణేష్ బాబు ఆ తర్వాత వెండితెరపై మళ్ళీ కనిపించింది లేదు.

అయితే బుల్లితెరపై బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా మారాడు…. కానీ అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు. ఇక సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ‘కొబ్బరిమట్ట’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిపోయింది. కానీ సినిమా విడుదలకు మాత్రం నోచుకోలేదు. రూపక్ రోనాల్డ్ సన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకి రావాల్సింది.

ఇప్పటికే చాలా సార్లు వాయిదా వేసి ఈ మధ్యనే ఆగస్టు 2న విడుదల తేదీ ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు దర్శక నిర్మాతలు మళ్లీ ఈ సినిమాని వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

ఆగస్టు 2 కాకుండా ‘కొబ్బరిమట్ట’ సినిమాను ఆగస్టు 10న విడుదల విడుదలకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ప్రేక్షకుల్ని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

First Published:  27 July 2019 4:38 AM GMT
Next Story