Telugu Global
National

కానిస్టేబుల్ నుంచి ఎఎస్సైగా డ‌బుల్ ప్ర‌మోష‌న్ పొందిన కార్గిల్ వీరుడు

కార్గిల్ యుద్ధ వీరుడు ఒక‌రు పంజాబ్‌లో ఓ సాధార‌ణ కానిస్టేబుల్‌గా జీవితం గ‌డుపుతున్న సంగ‌తి తెలుసుకున్న పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ అత‌డికి డ‌బుల్ ప్ర‌మోష‌న్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా అధికారుల‌ను ఆదేశించారు. దేశం యావ‌త్తు జులై 26వ తేదీన కార్గిల్ యుద్ధ‌వీరుల‌ను త‌ల‌చుకుంటూ విజ‌య్ దివ‌స్ జ‌రుపుకుంటున్న‌సంద‌ర్భంగా ‘వీర చ్ర‌క’ అవార్డు గ్ర‌హీత అయిన స‌త్పాల్ సింగ్‌కి కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైగా ప్ర‌మోష‌న్ ల‌భించింది. స‌త్పాల్ సింగ్‌ని ఉద్యోగంలోకి తీసుకునేట‌ప్పుడు అధికారులెవ‌రూ ఆయ‌న ఎవ‌ర‌నే విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు. […]

కానిస్టేబుల్ నుంచి ఎఎస్సైగా డ‌బుల్ ప్ర‌మోష‌న్ పొందిన కార్గిల్ వీరుడు
X

కార్గిల్ యుద్ధ వీరుడు ఒక‌రు పంజాబ్‌లో ఓ సాధార‌ణ కానిస్టేబుల్‌గా జీవితం గ‌డుపుతున్న సంగ‌తి తెలుసుకున్న పంజాబ్ ముఖ్య‌మంత్రి కెప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ అత‌డికి డ‌బుల్ ప్ర‌మోష‌న్ ఇవ్వ‌వ‌ల‌సిందిగా అధికారుల‌ను ఆదేశించారు.

దేశం యావ‌త్తు జులై 26వ తేదీన కార్గిల్ యుద్ధ‌వీరుల‌ను త‌ల‌చుకుంటూ విజ‌య్ దివ‌స్ జ‌రుపుకుంటున్న‌సంద‌ర్భంగా ‘వీర చ్ర‌క’ అవార్డు గ్ర‌హీత అయిన స‌త్పాల్ సింగ్‌కి కానిస్టేబుల్‌ నుంచి ఏఎస్సైగా ప్ర‌మోష‌న్ ల‌భించింది.

స‌త్పాల్ సింగ్‌ని ఉద్యోగంలోకి తీసుకునేట‌ప్పుడు అధికారులెవ‌రూ ఆయ‌న ఎవ‌ర‌నే విష‌యాన్ని ప‌ట్టించుకోలేదు.

పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలోని ఒక చిన్న ప‌ట్ట‌ణంలో 46 ఏండ్ల కార్గిల్ యుద్ధ‌వీరుడు ఏవిధంగా ట్రాఫిక్‌ని నియంత్రిస్తున్నాడో తెలియ‌జేస్తూ ‘ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్‌’ ప్ర‌తిక ఓ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. దీన్ని చూసి స్వ‌యంగా సైన్యంలో ప‌నిచేసి వ‌చ్చిన వాడైన పంజాబ్ ముఖ్య‌మంత్రి కాప్టెన్ అమ‌రీంద‌ర్ సింగ్ వెంట‌నే స్పందించారు.

స‌త్పాల్ కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న 8సిఖ్ టీం లో స‌భ్యుడు. ఈ బృందంలో ఇద్ద‌రు ఆఫీస‌ర్లు, న‌లుగురు జూనియ‌ర్ క‌మీష‌న్డ్ ఆఫీస‌ర్లు, 46 మంది ఇత‌ర రాంకుల్లో ఉన్న‌వారు ఉన్నారు.

ఈ యుద్ధంలో స‌త్పాల్ సింగ్ పాకిస్తాన్‌ నార్త‌ర్న్ లైట్ ఇన్‌ఫాంట్రీ బెటాలియ‌న్‌కి చెందిన కాప్టెన్ క‌ర్నాల్ షేర్‌ఖాన్‌తో పాటు మ‌రో ముగ్గుర్ని చంపేశాడు. భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న్ని ప‌ర‌మ వీర చ్ర‌క‌తో స‌త్క‌రించి గౌర‌వించుకున్న‌ది.
అకాలీ ద‌ళ్ ప్ర‌భుత్వం ఆయ‌న‌కి స‌రైన ఉద్యోగం ఇవ్వ‌కుండా త‌ప్పుచేసింద‌ని, తాను ఆ త‌ప్పుని స‌రిదిద్దుతున్నాన‌ని పంజాబ్ ముఖ్య‌మంత్రి అన్నారు.

First Published:  27 July 2019 5:27 AM GMT
Next Story