Telugu Global
NEWS

వన్డే క్రికెట్ కు లాసిత్ మలింగ గుడ్ బై

15 ఏళ్ల మలింగ వన్డే కెరియర్ కు తెర బంగ్లాదేశ్ తో ఆఖరి వన్డే ఆడిన యార్కర్ల కింగ్ యార్కర్ల కింగ్, శ్రీలంక ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగ…వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో భాగంగా.. కొలంబో రాజపక్సే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డేతో 15సంవత్సరాల తన వన్డే కెరియర్ కు మలింగ స్వస్తి పలికాడు. అయితే.. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తాను కొనసాగనున్నట్లు మలింగ తెలిపాడు. […]

వన్డే క్రికెట్ కు లాసిత్ మలింగ గుడ్ బై
X
  • 15 ఏళ్ల మలింగ వన్డే కెరియర్ కు తెర
  • బంగ్లాదేశ్ తో ఆఖరి వన్డే ఆడిన యార్కర్ల కింగ్

యార్కర్ల కింగ్, శ్రీలంక ఆల్ టైమ్ గ్రేట్ ఫాస్ట్ బౌలర్ లాసిత్ మలింగ…వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్ తో సిరీస్ లో భాగంగా.. కొలంబో రాజపక్సే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన తొలివన్డేతో 15సంవత్సరాల తన వన్డే కెరియర్ కు మలింగ స్వస్తి పలికాడు.

అయితే.. ధూమ్ ధామ్ టీ-20 క్రికెట్లో తాను కొనసాగనున్నట్లు మలింగ తెలిపాడు.

2004లో దంబుల్లా వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డే అరంగేట్రం చేసిన మలింగ ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు.

గత 15 సంవత్సరాల కాలంలో 226 వన్డే మ్యాచ్ లు ఆడిన మలింగ 338 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 38 పరుగులిచ్చి 6 వికెట్లు సాధించాడు.

ఎనిమిదిసార్లు 5 వికెట్లు, 11 సార్లు 4 వికెట్ల రికార్డులు సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో మూడు హ్యాట్రిక్ లు సాధించిన ఒకేఒక్క బౌలర్ లాసిత్ మలింగ మాత్రమే కావడం విశేషం.

ఆఖరి వన్డేలోనూ అదే జోరు…

కొలంబో వేదికగా బంగ్లాదేశ్ తో తన ఆఖరివన్డే ఆడిన మలింగ…9.4 ఓవర్లలో 2 మేడిన్ ఓవర్లతోసహా 38 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

329 అంతర్జాతీయ మ్యాచ్ ల్లో మలింగ మొత్తం 536 వికెట్లు పడగొట్టి…శ్రీలంక అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ గా రికార్డుల్లో చేరాడు.

ఇంగ్లండ్ వేదికగా ఇటీవలే ముగిసిన వన్డే ప్రపంచకప్ లో సైతం మలింగ 13 వికెట్లు సాధించడం ద్వారా శ్రీలంక నంబర్ వన్ బౌలర్ గా తన సత్తా చాటుకొన్నాడు.

మలింగకు బుమ్రా హ్యాట్సాఫ్…

వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన లాసిత్ మలింగకు భారత యార్కర్ల కింగ్ జస్ ప్రీత్ బుమ్రా హ్యాట్సాఫ్ చెప్పాడు.ముంబై ఇండియన్స్ తరపున మలింగతో కలసి ఆడటం ద్వారా తాను ఎంతో నేర్చుకొన్నానని…స్ఫూర్తి పొందానని బుమ్రా తెలిపాడు.

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, మెంటార్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం…మలింగను అభినందించారు. ముంబై ఫ్రాంచైజీకి మలింగ చేసిన సేవలు అపురూపమంటూ కొనియాడారు.

First Published:  28 July 2019 1:58 AM GMT
Next Story