Telugu Global
NEWS

ఏపీలో ఆగస్టు నుంచే ప్రభుత్వ మద్యం షాపులు

ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించినట్లుగా దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేయడంలో భాగంగా తొలి అడుగు పడుతోంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఆగస్టు నుంచే ప్రతీ జిల్లాలో 10 ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ మద్యం దుకాణాలకు గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 3 లక్షల వరకు నిర్వహణ […]

ఏపీలో ఆగస్టు నుంచే ప్రభుత్వ మద్యం షాపులు
X

ఏపీ సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించినట్లుగా దశల వారీగా మద్య నిషేధాన్ని అమలు చేయడంలో భాగంగా తొలి అడుగు పడుతోంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి మద్యం అమ్మకాలను ప్రభుత్వమే నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఆగస్టు నుంచే ప్రతీ జిల్లాలో 10 ప్రభుత్వ మద్యం దుకాణాలను తెరవాలని నిర్ణయించారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసే ఈ మద్యం దుకాణాలకు గ్రామీణ ప్రాంతాల్లో 2.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 3 లక్షల వరకు నిర్వహణ వ్యయం అవుతుందని అంచనా వేశారు. ప్రతీ దుకాణంలో ఒక సూపర్‌వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్లు, ఒక సెక్యూరిటీని నియమించనున్నారు. ఇవన్నీ కాంట్రాక్టు పద్దతిన అమలు చేస్తారు. అంతే కాకుండా ఈ పోస్టులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లతో పాటు స్థానికుల 75 శాతం రిజర్వేషన్లు కూడా అమలులో ఉంటాయి.

కాగా, మద్యం దుకాణాల్లో పని చేసే సిబ్బందిని జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో డిప్యుటీ కమిషనర్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, డిపో మేనేజర్లతో కూడిన కమిటీ ఎంపిక చేస్తుంది. సూపర్‌వైజర్‌కు 20 వేల వరకు, సేల్స్‌మెన్లకు 15 వేల వరకు జీతం ఇస్తారు. అలాగే ప్రతీ దుకాణంలో ఫ్యాన్లు, టేబుళ్లు, బాటిల్‌ కూలర్‌, ర్యాకులు, గ్రిల్స్, స్కానర్, సీసీ కెమెరాలతో పాటు కంప్యూటర్‌ బిల్లింగ్‌కు ఏర్పాటుకు లక్షన్నర వరకు ఖర్చు చేయనున్నారు.

ఇక మద్యం దుకాణాలకు డిపో నుంచి సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లను నియమిస్తారు. లోడింగ్, ట్రాన్స్‌పోర్ట్, అన్‌లోడింగ్ మొత్తం ఆ కాంట్రాక్టర్లదే బాధ్యత.

క్రమంగా ప్రైవేటు వ్యక్తులు కాకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించి.. క్రమంగా ప్రభుత్వ మద్యం దుకాణాలను కూడా తగ్గించుకుంటూ వస్తారు. ప్రభుత్వ దుకాణాలైతే మూసేయడం సులభంగా ఉంటుంది. అదే ప్రైవేటు వ్యక్తుల దుకాణాలను మూసేయించడం వల్ల చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

First Published:  27 July 2019 9:21 PM GMT
Next Story