మోక్షజ్ఞతో… బాలకృష్ణ పూజలు చేయించాడా?

బాలకృష్ణ త్వరలో కె ఎస్ రవి కుమార్ దర్శకత్వంలో ఒక కొత్త చిత్రం చేయనున్నాడు. ఇంతకు ముందే వీరిద్దరి కాంబినేషన్ లో జై సింహా వచ్చింది.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు డిజాస్టర్లు కావడంతో… ఈ సారి చేయబోయే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని అనుకుంటున్నాడు బాలకృష్ణ. వచ్చే నెల మొదటి వారం లో ఈ సినిమా కి సంబందించిన షూటింగ్ మొదలు కానుందట.

అయితే బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తెరంగేట్రం గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే బాలయ్య ఇప్పటి వరకు మోక్షజ్ఞ సినిమా గురించి క్లారిటీ ఇవ్వలేదు. మోక్షజ్ఞ ని సినిమాలకి పరిచయం చేస్తాను అని చెప్తూ వస్తున్నాడు కానీ ఏ విషయమూ తేల్చడం లేదు.

ఈ నేపథ్యం లో మోక్షజ్ఞ తో పుల్లేటికుర్రు లో ని ఒక దేవాలయం లో బాలకృష్ణ పూజలు చేయించాడు అని టాక్ నడుస్తుంది. అక్కడ మొదటిసారిగా మోక్షజ్ఞ కెమెరా కి చిక్కాడు. ఇప్పటి వరకు మోక్షజ్ఞ కొత్త లుక్ మీద ఎటువంటి క్లారిటీ లేదు.

ఇప్పుడు సోషల్ మీడియా లో లీకైన ఫొటో వైరల్ గా మారింది.. జిమ్ లో కొంచెం వర్క్ అవుట్స్ చేస్తే మంచి ఫిజిక్ కూడా సంపాదిస్తాడు.