Telugu Global
Cinema & Entertainment

డియర్ కామ్రేడ్ వీకెండ్ వసూళ్లు

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 12 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 3 రోజుల్లో ఇంత షేర్ అంటే అది చెప్పుకోదగ్గ విషయమే. కాకపోతే, సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో ఇవాళ్టి నుంచి ఇది థియేటర్లలో ఎంత రాబడుతుందనేదే లెక్క. రెవెన్యూ పరంగా చూసుకుంటే.. ఇప్పటివరకు 50శాతం […]

డియర్ కామ్రేడ్ వీకెండ్ వసూళ్లు
X

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా మిక్స్ డ్ టాక్ తో దూసుకుపోతోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో 12 కోట్ల 56 లక్షల రూపాయల షేర్ వచ్చింది. 3 రోజుల్లో ఇంత షేర్ అంటే అది చెప్పుకోదగ్గ విషయమే. కాకపోతే, సినిమాకు మిక్స్ డ్ టాక్ రావడంతో ఇవాళ్టి నుంచి ఇది థియేటర్లలో ఎంత రాబడుతుందనేదే లెక్క.

రెవెన్యూ పరంగా చూసుకుంటే.. ఇప్పటివరకు 50శాతం రికవరీ అయినట్టు మేకర్స్ ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని లాంగ్వేజెస్ తో కలుపుకొని సగం రికవరీ అయిందని నిర్మాతలు తెలిపారు. మరి మిగతా సగం రికవరీ అయి, బయ్యర్లు లాభాలు చూడాలంటే వీక్ డేస్ లో కూడా ఈ సినిమా బాగా ఆడాలి. అదే కాస్త అనుమానంగా ఉంది.

సి-సెంటర్ల నుంచి డియర్ కామ్రేడ్ కు వీక్ రెస్పాన్స్ వస్తోంది. ఎ-సెంటర్లలో సినిమా ఆడుతున్నప్పటికీ రిపీట్ ఆడియన్స్ రావడం లేదు. ఇవాళ్టి నుంచి ఈ సినిమాను ట్రిమ్ చేశారు. 13 నిమిషాల సీన్లు కట్ చేసి, ముందే తొలిగించిన క్యాంటీన్ సాంగ్ ను కలిపారు. ఈ మార్పుచేర్పులు రిపీట్ ఆడియన్స్ ను రప్పిస్తాయని భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు ఈ వీకెండ్ వచ్చిన షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం – రూ. 5.65 కోట్లు
సీడెడ్ – రూ. 1.08 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 1.56 కోట్లు
ఈస్ట్ – రూ. 1.20 కోట్లు
వెస్ట్ – రూ. 0.83 కోట్లు
గుంటూరు – రూ. 1.03 కోట్లు
నెల్లూరు – రూ. 0.48 కోట్లు
కృష్ణా – రూ. 0.73 కోట్లు

First Published:  29 July 2019 7:32 AM GMT
Next Story