Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి-దిల్ రాజు ఓకే..... కానీ దర్శకుడు?

తెలుగు సినిమా పరిశ్రమ లో దిల్ రాజు పెద్ద పేరున్న ప్రొడ్యూసర్. ప్రతి ఏడాది మంచి మంచి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తూ అందరి కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ ని చూస్తున్న నిర్మాత రాజు. అయితే నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసిన దిల్ రాజు ఎప్పటి నుంచో బాలకృష్ణ, చిరంజీవి తో కూడా పని చేయాలని అనుకుంటున్నాడట. బాలకృష్ణ తో సినిమా రేపో మాపో జరిగే వీలున్నా… చిరంజీవి తో సినిమా […]

చిరంజీవి-దిల్ రాజు ఓకే..... కానీ దర్శకుడు?
X

తెలుగు సినిమా పరిశ్రమ లో దిల్ రాజు పెద్ద పేరున్న ప్రొడ్యూసర్. ప్రతి ఏడాది మంచి మంచి సినిమాలని ప్రేక్షకులకి అందిస్తూ అందరి కన్నా ఎక్కువ సక్సెస్ రేట్ ని చూస్తున్న నిర్మాత రాజు.

అయితే నాగార్జున, వెంకటేష్ వంటి పెద్ద స్టార్స్ తో సినిమాలు చేసిన దిల్ రాజు ఎప్పటి నుంచో బాలకృష్ణ, చిరంజీవి తో కూడా పని చేయాలని అనుకుంటున్నాడట. బాలకృష్ణ తో సినిమా రేపో మాపో జరిగే వీలున్నా… చిరంజీవి తో సినిమా మాత్రం అంతకంతకూ వాయిదా పడుతూ వస్తుంది.

అయితే దిల్ రాజు ఇటీవలే చిరంజీవి కలిసి… సినిమా చేసందుకు మొత్తానికి ఒప్పించాడట. చిరంజీవి డేట్స్ ని రాజు సంపాదించాడట. ఈ కలయిక లో సినిమా కూడా ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అంటున్నారు…. కానీ అసలు చిక్కంతా ఇక్కడే ఉంది.

చిరంజీవి సినిమా చేయడానికి ఒప్పుకున్నారు, దిల్ రాజు నిర్మాత గా ఉంటారు… కానీ కథ, దర్శకుడు మాత్రం లేవు.

చిరంజీవి త్వరలో కొరటాల శివ తో, త్రివిక్రమ్ తో పని చేయనున్నాడు. అయితే చిరంజీవి ఫ్రీ అవ్వడానికి కనీసం రెండున్నర ఏళ్ళు అయినా పడుతుంది…. కాబట్టి ఆ లోపు మంచి కథ ని, దర్శకుడిని సెట్ చేయాలని దిల్ రాజు అనుకుంటున్నాడట.

మరి దిల్ రాజు ఏ దర్శకుడిని సెలెక్ట్ చేస్తోడో…. అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు.

First Published:  29 July 2019 2:13 AM GMT
Next Story