ఫార్ములావన్ జర్మన్ విజేత మాక్స్ వెర్ స్టాపెన్

  • టీమ్ మెర్సిడెస్ విజయాలకు రెడ్ బుల్ బ్రేక్

ఫార్ములావన్ 2019 సీజన్లో…టీమ్ మెర్సిడెస్ కమ్ లూయి హామిల్టన్ విజయాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. హోకెన్ హైమ్ వేదికగా ముగిసిన జర్మన్ గ్రాండ్ ప్రీ టైటిల్ ను టీమ్ రెడ్ బుల్ రేసర్ మాక్స్ వెర్ స్టాపెన్ గెలుచుకొని సంచలనం సృష్టించాడు.

ల్యాప్ ల్యాప్ కు ఆధిక్యం చేతులు మారుతూ వచ్చిన జర్మన్ టైటిల్ రేస్ లో..టీమ్ రెడ్ బుల్ స్టార్ డ్రైవర్ మాక్స్ వెర్ స్టాపెన్ విజేతగా నిలిచాడు.

టీమ్ ఫెరారీకి చెందిన సెబాస్టిన్ వెట్టల్ రెండో స్థానంలో నిలిచాడు. సీజన్ లీడర్, టీమ్ మెర్సిడెస్ స్టార్ రేసర్ లూయి హామిల్టన్ మాత్రం.. జర్మన్ ఫార్ములావన్ రేస్ లో దారుణంగా విఫలమయ్యాడు. పోల్ స్థానం నుంచి ఫైనల్ రేస్ ను ప్రారంభించిన హామిల్టన్ 11వ స్థానంలో నిలిచాడు.