Telugu Global
Cinema & Entertainment

'గ్యాంగ్ లీడర్'.... స్టోరీ లైన్ ఇదేనా?

‘జెర్సీ’ వంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని…. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ అనే ఫుల్ లెంత్ ఎంటర్ టైనింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని మరియు ఐదుగురు ఆడవాళ్లు కలిసి బ్యాంక్ […]

గ్యాంగ్ లీడర్.... స్టోరీ లైన్ ఇదేనా?
X

‘జెర్సీ’ వంటి ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాతో హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని…. ఇప్పుడు ‘గ్యాంగ్ లీడర్’ అనే ఫుల్ లెంత్ ఎంటర్ టైనింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో నాని మరియు ఐదుగురు ఆడవాళ్లు కలిసి బ్యాంక్ రాబరీ చేయబోతున్నారట. అయితే యాక్షన్ సన్నివేశాలతో కాకుండా బుద్ధి బలం ఉపయోగించి నాని ఈ సినిమాలో బ్యాంక్ ని లూటి చేస్తాడట.

ఆ తర్వాత ఏం జరిగింది? అనే దాని చుట్టూ సెకండ్ హాఫ్ తిరుగుతుందని తెలుస్తోంది. ఇంతకుముందు తీసిన సినిమాలకు భిన్నంగా విక్రమ్ కె కుమార్ ఈ సినిమాలో ఎంటర్ టైన్ కి పెద్దపీట వేశారని టీజర్ చూస్తేనే తెలుస్తోంది.

పెన్సిల్ పార్థసారధి పాత్రలో నాని ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించబోతున్నాడట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుంది.

మరి ఈ సినిమాతో నాని ఎలాంటి హిట్ అందుకుంటాడో వేచి చూడాల్సి ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నాడు.

First Published:  29 July 2019 12:56 AM GMT
Next Story