నవంబర్ లో…. బన్నీ- బోయపాటి సినిమా

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ వంటి హిట్ సినిమాల తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

అయితే ఈ సినిమా పూర్తయిన తర్వాత అల్లు అర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే ‘వినయ విధేయ రామ’ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న బోయపాటి… అల్లు అర్జున్ తో సినిమాతోనైనా మంచి హిట్ అందుకోవాలని ఆశిస్తున్నాడు.

అల్లు అరవింద్ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇంతకుముందు బోయపాటి దర్శకత్వంలో లో అల్లు అర్జున్ ‘సరైనోడు’ సినిమా లో నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళనే రాబట్టింది.

మరి వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న రెండో సినిమా కూడా హిట్ అవుతుందో లేదో చూడాలి. బన్నీ త్రివిక్రమ్ సినిమా టాకీ పార్ట్ నవంబర్ తో పూర్తవుతుంది…. కాబట్టి బన్నీ బోయపాటి సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను…. బాలకృష్ణ హీరోగా మరొక సినిమా చేయబోతున్నారు.