Telugu Global
Cinema & Entertainment

'పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్'....

ఈమధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న  శర్వానంద్ ఇప్పుడు ‘రణరంగం’ అనే సినిమాతో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కల్యాణీ ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే శర్వా, కల్యాణి కలిసి నటించిన రెండు పాటలను విడుదల చేసిన దర్శక నిర్మాతలు… తాజాగా శర్వా, కాజల్ అగర్వాల్ ల మధ్య వచ్చే ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ పాటను విడుదల […]

పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్....
X

ఈమధ్యనే ‘పడి పడి లేచే మనసు’ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు ‘రణరంగం’ అనే సినిమాతో త్వరలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు కల్యాణీ ప్రియదర్శన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇప్పటికే శర్వా, కల్యాణి కలిసి నటించిన రెండు పాటలను విడుదల చేసిన దర్శక నిర్మాతలు… తాజాగా శర్వా, కాజల్ అగర్వాల్ ల మధ్య వచ్చే ‘పిల్ల పిక్చర్ పర్ఫెక్ట్’ పాటను విడుదల చేశారు. ఈ వీడియో సాంగ్ లో కాజల్ మరియు శర్వా ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రశాంత్ పిళ్ళై ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు.

మాస్ యాక్షన్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో శర్వానంద్ ఒక గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీన విడుదలకు సిద్దం అవుతుంది. మరి ఈ సినిమాతో శర్వానంద్ ఎంతవరకు హిట్ అందుకుంటాడో చూడాలి.

First Published:  29 July 2019 5:29 AM GMT
Next Story