Telugu Global
CRIME

జైశ్రీరాం అనలేదని బాలుడికి నిప్పు

యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మరోసారి జైశ్రీరాం నినాదం నిప్పురాజేసింది. మతోన్మాదులు జైశ్రీరాం నినాదం మాటున దాడికి తెగబడ్డారు. జైశ్రీరాం అనాలంటూ 15ఏళ్ల ముస్లిం బాలుడిపై నలుగురు వ్యక్తులు ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో కిరోసిన్ పోసి నిప్పు అంటించారు. మంటల్లో బాలుడు దాదాపు 60 శాతం కాలిపోయాడు. సమీపంలోని కబీర్ చౌరా ఆస్పత్రికి బాలుడిని తరలించారు. పోలీసులు బాలుడి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని దాన్ని వీడియోగా చిత్రీకరించారు. జైశ్రీరాం అనాల్సిందిగా తనపై […]

జైశ్రీరాం అనలేదని బాలుడికి నిప్పు
X

యోగి ఆదిత్యనాథ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న ఉత్తరప్రదేశ్‌లో మరోసారి జైశ్రీరాం నినాదం నిప్పురాజేసింది. మతోన్మాదులు జైశ్రీరాం నినాదం మాటున దాడికి తెగబడ్డారు.

జైశ్రీరాం అనాలంటూ 15ఏళ్ల ముస్లిం బాలుడిపై నలుగురు వ్యక్తులు ఒత్తిడి తెచ్చారు. అందుకు ఆ బాలుడు నిరాకరించడంతో కిరోసిన్ పోసి నిప్పు అంటించారు.

మంటల్లో బాలుడు దాదాపు 60 శాతం కాలిపోయాడు. సమీపంలోని కబీర్ చౌరా ఆస్పత్రికి బాలుడిని తరలించారు.

పోలీసులు బాలుడి నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని దాన్ని వీడియోగా చిత్రీకరించారు. జైశ్రీరాం అనాల్సిందిగా తనపై ఒత్తిడి తెచ్చారని అందుకు తాను నిరాకరించడంతో నిప్పు పెట్టారని బాలుడు స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అతడి పరిస్థితి విషమంగానే ఉంది.

First Published:  28 July 2019 11:42 PM GMT
Next Story