Telugu Global
Cinema & Entertainment

సొంత బ్రాండ్ లాంచ్ చేయబోతున్న స్టైలిష్ స్టార్

ప్రస్తుతం యువ హీరోలు అందరూ కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు బట్టల బిజినెస్ లోకి దిగాడు. రౌడీ వేర్ బ్రాండ్ తో విజయ్ దేవరకొండ ఇప్పటికే బట్టల బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ ఆ బ్రాండ్ బట్టలే వాడుతూ ఉంటారు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ మరియు తెలుగులో […]

సొంత బ్రాండ్ లాంచ్ చేయబోతున్న స్టైలిష్ స్టార్
X

ప్రస్తుతం యువ హీరోలు అందరూ కేవలం సినిమాల మీద మాత్రమే కాకుండా బిజినెస్ మీద కూడా దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు బట్టల బిజినెస్ లోకి దిగాడు.

రౌడీ వేర్ బ్రాండ్ తో విజయ్ దేవరకొండ ఇప్పటికే బట్టల బిజినెస్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు విజయ్ దేవరకొండ అభిమానులు అందరూ ఆ బ్రాండ్ బట్టలే వాడుతూ ఉంటారు.

బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ మరియు తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు తదితరులు కూడా ఇదే జాబితాలో ఉంటారు. అయితే తాజాగా ఈ జాబితాలో చేరుతున్నాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.

అల్లు అర్జున్ ఇప్పుడు స్వయంగా ఒక బట్టల బిజినెస్ మొదలు పెట్టబోతున్నాడట. తన సొంత బ్రాండ్ ని లాంచ్ చేయబోతున్నాడట బన్నీ. దీనికి స్టార్ (STAAR) అని పేరు పెట్టడం విశేషం. అందులో ఉన్న రెండు ‘A’ అక్షరాలు చూస్తుంటే అది బన్ని సిగ్నేచర్ మార్క్ అని అందరికీ తెలిసిపోతుంది.

ప్రతి సినిమాలోనూ సరికొత్త హెయిర్ స్టైల్, సరి కొత్త లుక్ తో ప్రేక్షకులను అలరిస్తూ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు బ్రాండ్ పెట్టాడు అంటే కచ్చితంగా మెగా అభిమానులు అందరూ ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ బ్రాండ్ గురించిన మరిన్ని వివరాలు ఆగస్టు 15న ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.

First Published:  30 July 2019 5:23 AM GMT
Next Story