Telugu Global
Cinema & Entertainment

అల్లు అర్జున్ పంద్రాగస్ట్ కానుక

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడా రోజు రానే వచ్చింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. అయితే ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే, ఇంకో 2 వారాలు ఆగాల్సిందే. అవును.. ఆగస్ట్ 15న బన్నీ-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేస్తారు. పనిలో పనిగా లోగో డిజైన్ కూడా రిలీజ్ చేస్తారు. త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ అన్నీ డిఫరెంట్ గా, కవితాత్మకంగా ఉంటాయి. త్రివిక్రమ్ […]

అల్లు అర్జున్ పంద్రాగస్ట్ కానుక
X

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు బన్నీ. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఇప్పుడా రోజు రానే వచ్చింది. బన్నీ-త్రివిక్రమ్ సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. అయితే ఆ టైటిల్ ఏంటో తెలియాలంటే, ఇంకో 2 వారాలు ఆగాల్సిందే. అవును.. ఆగస్ట్ 15న బన్నీ-త్రివిక్రమ్ మూవీ టైటిల్ ఎనౌన్స్ చేస్తారు. పనిలో పనిగా లోగో డిజైన్ కూడా రిలీజ్ చేస్తారు.

త్రివిక్రమ్ సినిమా టైటిల్స్ అన్నీ డిఫరెంట్ గా, కవితాత్మకంగా ఉంటాయి. త్రివిక్రమ్ గత సినిమాలైన సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అజ్ఞాతవాసి టైటిల్స్ తరహాలోనే.. బన్నీ మూవీ టైటిల్ కూడా డిఫరెంట్ గా ఉండబోతోంది. గతంలో అత్తారింటికి దారేది టైటిల్ ను తనకు తెలియకుండానే లీక్ చేసింది హీరోయిన్ సమంత. ఈసారి ఆ పని పూజా హెగ్డే చేస్తుందేమో చూడాలి.

సినిమాకు సంబంధించి రేపట్నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. కాకినాడలో ఈ షెడ్యూల్ ప్లాన్ చేశారు. రీసెంట్ గా అసిస్టెంట్ డైరక్టర్ తో వచ్చిన వివాదం కారణంగా ఈ సినిమా షెడ్యూల్ ముందుగానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక కాకినాడ షెడ్యూల్ విషయానికొస్తే, ఔట్ డోర్ లో ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్ వర్షం కారణంగా రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  29 July 2019 8:01 PM GMT
Next Story