కిడ్నాప్‌కు గురైన సోనీ సేఫ్…

వారం రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన బీ ఫార్మసీ అమ్మాయి సోనీ క్షేమంగా వచ్చింది. కిడ్నాపర్ రవిశేఖర్‌ తనకు తాను ఆమెను వదిలిపెట్టాడు. ప్రకాశం జిల్లా అద్దంకి వద్ద సోనీని కిడ్నాపర్ వదిలేశారు.

అద్దంకి నుంచి బస్సులో వచ్చి హైదరాబాద్ ఎంజీబీఎస్‌ బస్‌స్టేషన్‌లో దిగిన సోనీ… అనంతరం పోలీసులకు సమాచారం అందించింది. రవిశేఖర్‌ తనను వదిలిపెట్టాడని హైదరాబాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చింది. దాంతో పోలీసులు ఎంజీబీఎస్‌కు చేరుకుని అమ్మాయిని స్టేషన్‌కు తీసుకెళ్లారు.

వారం రోజులు ఏం జరిగింది?, రవిశేఖర్‌ తో ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అన్న దానిపై ఆమెను పోలీసులు విచారిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌గా ఉన్న రవిశేఖర్‌ పై నాలుగు రాష్ట్రాల్లో 35 కేసులు ఉన్నాయి. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి సోనీని రవిశేఖర్‌ వారం రోజుల క్రితం తీసుకెళ్లాడని చెబుతున్నారు. అప్పటి నుంచి ఆమె ఆచూకీ లేదు. ఎట్టకేలకు కిడ్నాపరే అమ్మాయిని వదిలేశాడు.