Telugu Global
CRIME

మిస్టరీగా మారిన కాఫీ డే ఓనర్ అదృశ్యం

కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్దార్థ కనిపించకుండా పోయారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే సిద్దార్థ. సోమవారం కారులో మంగళూరు వెళ్తూ నేత్రావతి నది వద్ద డ్రైవర్ ను కార్ ఆపమన్న సిద్దార్థ …ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఎంతకీ రాలేదు. దీంతో ఆయన కోసం చుట్టుపక్కల వెతికారు. అప్పటినుంచి సిద్దార్థ ఆచూకీ దొరకడం లేదు. సెల్ కూడా స్విచ్ ఆఫ్ అయింది. హై ప్రొఫైల్ కేసు కావడంతో […]

మిస్టరీగా మారిన కాఫీ డే ఓనర్ అదృశ్యం
X

కేఫ్ కాఫీ డే ఫౌండర్ వీజీ సిద్దార్థ కనిపించకుండా పోయారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడే సిద్దార్థ.

సోమవారం కారులో మంగళూరు వెళ్తూ నేత్రావతి నది వద్ద డ్రైవర్ ను కార్ ఆపమన్న సిద్దార్థ …ఫోన్ మాట్లాడుతూ పక్కకి వెళ్లారు. అలా వెళ్లిన ఆయన ఎంతకీ రాలేదు. దీంతో ఆయన కోసం చుట్టుపక్కల వెతికారు. అప్పటినుంచి సిద్దార్థ ఆచూకీ దొరకడం లేదు. సెల్ కూడా స్విచ్ ఆఫ్ అయింది.

హై ప్రొఫైల్ కేసు కావడంతో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ మొదలెట్టారు. సిద్దార్థ చివరి కాల్ కేఫ్ కాఫీ డే సీఎఫ్ వో తో మాట్లాడినట్టు తెలిసింది. 57 సెకన్ల పాటు మాట్లాడిన తర్వాత కారు దిగిన సిద్ధార్ధ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నేత్రవది నదిలో దూకి సూసైడ్ చేసుకుని ఉంటారని అందరూ అనుకుంటున్నారు.

నేత్రవతి నది లో బోట్ ల సహాయం తో గాలింపు చేపట్టారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో మిస్సింగ్ కేసు అని పోలీసులు బయటకి చెబుతున్నారు. ఇప్పటికే ఎస్ఎం కృష్ణ ఇంటికి సీఎం యడియూరప్ప ఇతర నేతలు చేరుకున్నారు. ఆయన్ని పరామర్శించారు.

కాఫీ డే కంపెనీకి నష్టాలు రావడంతో పాటు ఇతర వ్యాపార లావాదేవీల వల్లే సిద్ధార్థ సూసైడ్ చేసుకోని ఉండొచ్చని సన్నిహితుల అనుమానం.

First Published:  30 July 2019 12:33 AM GMT
Next Story