దారుణం గా పడిపోయిన డియర్ కామ్రేడ్ కలెక్షన్స్

ఊహించని విధం గా విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా కలెక్షన్స్ సోమవారం నాడు దారుణంగా పడిపోయాయి. బోనాల పండుగ సెలవు కూడా ఈ సినిమా కి ఏ మాత్రం ఉపయోగపడలేదు అని చెప్పొచ్చు.

మొత్తం మీద సోమవారం నాడు కేవలం కోటి రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 13.58 కోట్లు రాబట్టింది. ఇదే కొనసాగితే ఈ సినిమా కచ్చితంగా బయ్యర్లకి భారీ నష్టాలను మిగిల్చేలాగే ఉంది. ఏదో ఒకటి చేసి కాస్త ప్రమోషన్స్ స్పీడ్ పెంచితే తప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా నిలబడే పరిస్థితి కనిపించడం లేదు.

విజయ్ దేవరకొండ-రష్మిక జంటగా నటించగా, ఈ సినిమా కి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు.

తెలుగు రాష్ట్రాలలో… ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

నైజాం: 6.44 Cr
సీడెడ్: 1.13 Cr
ఉత్తరాంధ్ర: 1.62 Cr
ఈస్ట్ గోదావరి: 1.22 Cr
వెస్ట్ గోదావరి: 0.86 Cr
కృష్ణ: 0.76 Cr
గుంటూరు: 1.05 Cr
నెల్లూరు: 0.50 Cr
ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ: 13.58 Cr