ఎస్‌ఐకి ముద్దు పెట్టిన యువకుడిపై కేసు నమోదు

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను కొందరు అలుసుగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేసి చిక్కుల్లో పడుతున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బోనాలు సందర్భంగా ఒక యువకుడు … ఎస్‌ఐ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో బోనాల సందర్బంగా స్థానికులంతా కలిసి ఎంజాయ్ చేశారు. ఆ సమయంలో బాగా మద్యం సేవించి ఉన్న భాను అనే 25ఏళ్ల యువకుడు అటుగా వెళ్తున్న ఎస్‌ఐ మహేందర్‌ను ఆపి మరీ హఠాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు.

ఈ చర్యకు ఎస్‌ఐ ఆగ్రహం వ్యక్తం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఎస్‌ఐ పట్ల ఇలా చులకనగా వ్యవహరించిన భానుపై నల్లకుంట పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతడు ఒక బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు.