Telugu Global
National

ట్రిపుల్ తలాక్.. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ ఓటు

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా వైసీపీ రాజకీయాల్లో స్టిక్ట్ గా ఉంటోంది. ఇప్పుడు పుట్టెడు అప్పుల్లో ఉన్న ఏపీకి కేంద్ర సాయం అవసరం. ఆ పార్టీ నిర్ణయాలను ఎదిరిస్తే కష్టమే. కానీ నిధులకంటే కూడా ప్రజల మనోభావాలే ముఖ్యమని వైసీపీ నిరూపించింది. బీజేపీ ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లును వైసీపీ పార్లమెంట్ లో వ్యతిరేకించి సంచలనం సృష్టించింది. పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరిగింది. రాజ్యసభలో విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించారు. అధికార బీజేపీ […]

ట్రిపుల్ తలాక్.. బీజేపీకి వ్యతిరేకంగా వైసీపీ ఓటు
X

తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా వైసీపీ రాజకీయాల్లో స్టిక్ట్ గా ఉంటోంది. ఇప్పుడు పుట్టెడు అప్పుల్లో ఉన్న ఏపీకి కేంద్ర సాయం అవసరం. ఆ పార్టీ నిర్ణయాలను ఎదిరిస్తే కష్టమే. కానీ నిధులకంటే కూడా ప్రజల మనోభావాలే ముఖ్యమని వైసీపీ నిరూపించింది. బీజేపీ ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లును వైసీపీ పార్లమెంట్ లో వ్యతిరేకించి సంచలనం సృష్టించింది.

పార్లమెంట్ లో ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చ జరిగింది. రాజ్యసభలో విపక్షాలన్నీ బిల్లును వ్యతిరేకించారు. అధికార బీజేపీ మాత్రం ఆమోదించడానికి బలపర్చింది. అయితే బీజేపీ కేంద్ర అధిష్టానంతో సానుకూలంగా ఉంటున్న వైసీపీ ఈ సందర్భంగా బీజేపీకి షాకిచ్చింది.

వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. అంతేకాదు బిల్లులోని లోపాలను ఎత్తి చూపించి వైసీపీ లౌకిక పార్టీ అని స్పష్టం చేశారు.

మంగళవారం చర్చలో పాల్గొన్న వైసీపీ పక్షనేత విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా ముస్లింలు వ్యతిరేకిస్తున్న ఈ బిల్లును లౌకికవాదాన్ని పాటించే వైసీపీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ ట్రిపుల్ తలాక్ బిల్లులోని ఆరు అంశాలపై తమకు అభ్యంతరాలున్నాయని విజయసాయిరెడ్డి స్పష్టం చేయడం విశేషం.

చట్టంలో లేని అంశాల ఆధారంగా ఇందులో కఠిన శిక్షలను ఎలా విధిస్తారని .. భర్తను జైల్లో పెడితే భార్యకు మనోవర్తి ఎలా చెల్లిస్తారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ముస్లిం వివాహం సివిల్ కాంట్రాక్ట్ అని దీనిపై క్రిమినల్ చర్యలు ఎలా తీసుకుంటారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఇలా ఇన్నాళ్లు కేంద్రంలోని బీజేపీ ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతుదారుగా ఉంటూ స్నేహం చేస్తున్న వైసీపీ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ ప్రయోజనాల కంటే తమకు ప్రజల సెంటిమెంట్ ముఖ్యమని వైసీపీ నిరూపించినట్టైంది.

First Published:  30 July 2019 5:43 AM GMT
Next Story