Telugu Global
Cinema & Entertainment

మెగాహీరోకి షాక్ ఇచ్చిన 'సైరా' నటుడు

త్వరలో మెగా హీరోల జాబితాలో ఒక కొత్త నటుడు చేరబోతున్న సంగతి తెలిసిందే. అతను ఎవరో కాదు సాయి ధరంతేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఉప్పెన’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ ‘సైరా’ సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి […]

మెగాహీరోకి షాక్ ఇచ్చిన సైరా నటుడు
X

త్వరలో మెగా హీరోల జాబితాలో ఒక కొత్త నటుడు చేరబోతున్న సంగతి తెలిసిందే. అతను ఎవరో కాదు సాయి ధరంతేజ్ తమ్ముడైన వైష్ణవ్ తేజ్. ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ఉప్పెన’ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ ‘సైరా’ సినిమాలో కూడా ముఖ్యపాత్ర పోషిస్తున్న విజయ్ సేతుపతి వైష్ణవ్ కి పెద్ద షాక్ ఇచ్చాడు.

విజయ్ సేతుపతి ‘ఉప్పెన’ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దానికి గల కారణాల గురించి మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

నిజానికి విజయ్ సేతుపతి సినిమాలో ముఖ్య పాత్ర అనగానే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో సినిమా పైన అంచనాలు కూడా తగ్గుతాయని కొందరంటున్నారు.

ఏదేమైనా ఈ మెగా హీరోకి మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పాలి. గోదావరి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో ఒక స్వచ్ఛమైన ప్రేమ కథ చుట్టూ తిరిగే పీరియడ్ డ్రామా నే ‘ఉప్పెన’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను ఈ మధ్యనే సెట్స్ పైకి తీసుకెళ్లింది. త్వరగా సినిమా షూటింగ్ పూర్తి చేసి ఈ ఏడాది ఆఖరుకల్లా విడుదల చేయాలని దర్శక-నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

First Published:  30 July 2019 2:25 AM GMT
Next Story