Telugu Global
Cinema & Entertainment

'మన్మధుడు 2' కి అంత బడ్జెట్టా?

నాగార్జున హీరోగా ఈ మధ్యనే దర్శకుడి అవతారం ఎత్తిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. లక్ష్మీ, రావు రమేష్, దేవదర్శిని, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం మన్మధుడు సినిమా కోసం దర్శకనిర్మాతలు 24 కోట్ల […]

మన్మధుడు 2 కి అంత బడ్జెట్టా?
X

నాగార్జున హీరోగా ఈ మధ్యనే దర్శకుడి అవతారం ఎత్తిన రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ‘మన్మధుడు 2’ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

రకుల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. లక్ష్మీ, రావు రమేష్, దేవదర్శిని, వెన్నెల కిషోర్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం మన్మధుడు సినిమా కోసం దర్శకనిర్మాతలు 24 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు తెలుస్తోంది. నాగార్జున తీసుకోబోయే రెమ్యూనరేషన్ మినహా సినిమా బడ్జెట్ 24 కోట్లు అయినట్లు తెలుస్తోంది.

అయితే ఇప్పటికే చిత్ర రైట్స్ రూపంలో సగం కంటే ఎక్కువ బడ్జెట్ తిరిగి వచ్చేసిందట. మిగతా బడ్జెట్ కలెక్షన్స్ రూపంలో తిరిగి వచ్చేస్తే సినిమా హిట్టయినట్టే చెప్పుకోవచ్చు.

భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కాబోతుంది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరి ఈ మధ్యనే ‘దేవదాసు’ సినిమాతో డిజాస్టర్ అందుకున్న నాగార్జున ఈ సినిమాతో నైనా మంచి హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

First Published:  31 July 2019 2:00 AM GMT
Next Story