డబ్బు ఎగ్గొట్టిన బెల్లంకొండ… అరెస్ట్‌ వారెంట్…

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ చానల్‌ వేసిన కేసులో ఈ అరెస్ట్ వారెంట్‌ జారీ అయింది. తమకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వకుండా బెల్లంకొండ సురేష్‌ వేధిస్తున్నారంటూ చానల్‌ వారు కోర్టును ఆశ్రయించారు.

2010లో యష్‌రాజ్‌ ఫిలింస్ నిర్మించిన బాండ్ బాజా బరాత్‌ సినిమా హిందీలో భారీ హిట్ అయింది. 2013లో బెల్లంకొండ సురేష్‌ … హీరో సిద్ధార్థ్‌, హీరోయిన్‌ సమంతతో జబర్ధస్త్ అనే సినిమా తీశాడు.

అయితే బాండ్ బాజా బరాత్‌ నుంచి 19 సీన్లను కాపీ కొట్టి జబర్దస్త్‌ సినిమా తీశారు. దీనిపై యష్‌రాజ్ ఫిలింస్‌ ఢిల్లీ కోర్టును ఆశ్రయించగా… జబర్దస్త్ సినిమా విడుదల కాకుండా అడ్డుకుంది. అప్పటికే ఈ చిత్రం శాటిలైట్ హక్కులను బెల్లంకొండ ఒక టీవీ చానల్‌కు రూ. 3. 5 కోట్లకు అమ్మేశారు.

కోర్టు సదరు సినిమాను టీవీల్లో కూడా ప్రసారం చేయడానికి వీల్లేదని ఆదేశించింది. దాంతో తమ సొమ్ము తిరిగి ఇవ్వాలంటూ బెల్లంకొండ సురేష్‌ను చానల్‌ డిమాండ్ చేసింది. డబ్బు తిరిగి ఇచ్చేందుకు బెల్లంకొండ అంగీకరించలేదు.

దాంతో చానల్‌ వారు కోర్టుకు వెళ్లారు. వడ్డీతో కలిసి ప్రస్తుతం ఆ మొత్తం 11.75 కోట్లకు చేరింది. ఈ డబ్బు చెల్లించేందుకు బెల్లంకొండ నిరాకరించడంతో అరెస్ట్ వారెంజ్ జారీ అయింది.