Telugu Global
Cinema & Entertainment

వైల్డ్ కార్డు గా... బిగ్ బాస్ లోకి రాబోతున్న మరో ఇద్దరు భామలు

మొదటి రెండు సీజన్ లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 3 వివాదాల మధ్య మొదలవడమే కాక….. మొదలైన రెండు మూడు రోజులకే కంటెస్టెంట్ ల మధ్య కూడా గొడవలతో దూసుకుపోతోంది. ప్రతి ఎపిసోడ్ షో పై ఆసక్తి పెంచే విధంగా ఉంటోంది. మొదటి వారం నామినేషన్స్ కి వెళ్ళిన ఆరుగురిలో నుంచి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే రెండవ వారం మొదట్లో బిగ్ బాస్ హౌస్ లోకి తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ […]

వైల్డ్ కార్డు గా... బిగ్ బాస్ లోకి రాబోతున్న మరో ఇద్దరు భామలు
X

మొదటి రెండు సీజన్ లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్ 3 వివాదాల మధ్య మొదలవడమే కాక….. మొదలైన రెండు మూడు రోజులకే కంటెస్టెంట్ ల మధ్య కూడా గొడవలతో దూసుకుపోతోంది. ప్రతి ఎపిసోడ్ షో పై ఆసక్తి పెంచే విధంగా ఉంటోంది.

మొదటి వారం నామినేషన్స్ కి వెళ్ళిన ఆరుగురిలో నుంచి హేమ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే రెండవ వారం మొదట్లో బిగ్ బాస్ హౌస్ లోకి తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చారు.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈసారి మరొక ఇద్దరూ హాట్ బ్యూటీ లు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ ఇవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

నటిగా మంచి పేరు తెచ్చుకున్న శ్రద్ధాదాస్ కెరీర్ లో పెద్దగా చెప్పుకోదగ్గ హిట్ సినిమాలు అంటూ ఏమీ లేవు. గత కొంతకాలంగా తెలుగు తెరకు దూరంగా ఉంటున్న శ్రద్ధాదాస్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అవబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరి ఆ రెండవ అమ్మాయి ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

మరోవైపు ఈసారి నామినేషన్స్ లో ఎనిమిది మంది ఉండటం విశేషం. శ్రీముఖి, హిమజా, వరుణ్ సందేశ్, వితికా, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, పునర్నవి ఈవారం ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. మరి వీరిలో ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌస్ వదిలి వెళ్లబోతున్నారో ఇంకా తెలియాల్సి ఉంది.

First Published:  1 Aug 2019 1:48 AM GMT
Next Story