సాహో: ముందు ఆట…. ఆ తర్వాత ఆటా-పాటా

ప్రభాస్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా సాహో. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధిస్తుందో తెలియదు కానీ…. విడుదల కి ముందు సినిమా పై అంచనా మాత్రం అమాంతం పెరిగిపోతూ ఉంది.

సుజీత్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా ని యువీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తుంది. ఒకరకం గా చెప్పాలంటే ఇది ప్రభాస్ సొంత బ్యానర్. ఇదే నిర్మాతల ద్వారా సుజీత్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు. ఇప్పుడు ప్రభాస్ తో సాహో అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కి సంబందించిన ప్రమోషన్స్ లో ఇటీవలే స్పీడ్ పెంచారు నిర్మాతలు.

తాజాగా సాహో సినిమా కాన్సెప్ట్ కి సంబందించిన గేమ్ ఒకటి లాంచ్ చేస్తారట. విడుదల కి ముందే ఈ గేమ్ ని లాంచ్ చేసి దానిని అభిమానుల్లోకి తీసుకొని వెళ్ళాలి అనే ప్రయత్నం లో ఉన్నారు దర్శక నిర్మాతలు. దానికి సంబందించిన పోస్టర్ కూడా ఇటీవలే బయటకు వచ్చింది.

ముందుగా ఆట మొదలవుతుంది, ఆ తర్వాత సినిమా కి సంబదించిన ఆటా-పాటా ప్రేక్షకులకి రుచి చూపించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా తో హిందీ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తెలుగు లో తెరంగేట్రం చేస్తుంది.