Telugu Global
NEWS

విరాట్ కొహ్లీకి ఆ హక్కు ఉంది

భారత కెప్టెన్ కు అండగా సౌరవ్ గంగూలీ కొహ్లీకి ఆ హక్కు లేదన్న గయక్వాడ్ భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ సలహాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తనకు ఇష్టమైన శిక్షకుడు ఉండాలని కోరుకొనే హక్కు జట్టు కెప్టెన్ కు ఉంటుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు. రవి శాస్త్రిని కోచ్ గా కొనసాగించాలని కోరుకొనే హక్కు విరాట్ కొహ్లీకి ఉందని…అందులో తప్పేమీలేదని దాదా అన్నాడు. గత మూడేళ్లుగా […]

విరాట్ కొహ్లీకి ఆ హక్కు ఉంది
X
  • భారత కెప్టెన్ కు అండగా సౌరవ్ గంగూలీ
  • కొహ్లీకి ఆ హక్కు లేదన్న గయక్వాడ్

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా రవిశాస్త్రిని కొనసాగించాలన్న కెప్టెన్ విరాట్ కొహ్లీ సలహాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తనకు ఇష్టమైన శిక్షకుడు ఉండాలని కోరుకొనే హక్కు జట్టు కెప్టెన్ కు ఉంటుందని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తేల్చి చెప్పాడు.

రవి శాస్త్రిని కోచ్ గా కొనసాగించాలని కోరుకొనే హక్కు విరాట్ కొహ్లీకి ఉందని…అందులో తప్పేమీలేదని దాదా అన్నాడు.

గత మూడేళ్లుగా రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా తాము అద్భుతాలు సాధించినట్లు…విండీస్ టూర్ కు బయలుదేరబోయే ముందు కెప్టెన్ కొహ్లీ వ్యాఖ్యానించాడు.

అయితే…భారత మాజీ కెప్టెన్, సీనియర్ కామెంటీటర్ సునీల్ గవాస్కర్ మాత్రం…ప్రపంచకప్ సెమీఫైనల్స్ ఓటమి తర్వాత… కెప్టెన్ గా కొహ్లీని కొనసాగించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు.

కొహ్లీ ప్రభావితం చేయలేడు – గయక్వాడ్

రవి శాస్త్రినే భారతజట్టు ప్రధానశిక్షకుడిగా కొనసాగించాలంటూ కెప్టెన్ విరాట్ కొహ్లీ మీడియా సమావేశంలో కోరడంపై..భారత క్రికెట్ సలహామండలి సభ్యుడు అంశుమాన్ గయక్వాడ్ ప్రతిస్పందించారు.

భారత జట్టుకు చీఫ్ కోచ్ గా ఎవరిని ఎంపిక చేయాలో తమకు తెలుసునని…కెప్టెన్ కొహ్లీ తన మనసులోమాట బయట పెట్టి తమను ప్రభావితం చేయలేడని.. భారత క్రికెట్ సరికొత్త సలహామండలి సభ్యుడు గయక్వాడ్ వ్యాఖ్యానించారు.

భారత చీఫ్ కోచ్ ను నియమించడం కోసం…కపిల్ దేవ్ , గయక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా ముగ్గురు సభ్యుల సలహామండలిని.. బీసీసీఐ పాలకమండలి నియమించింది.

భారత క్రికెట్ చీఫ్ కోచ్ పోస్ట్ కోసం..తమకు ఇప్పటికే దేశవిదేశాల నుంచి ఎన్నో దరఖాస్తులు అందాయని, వారిలో ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి సైతం ఉన్నాడని గయక్వాడ్ తెలిపారు.

భారత క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము చేయాల్సింది చేస్తామని..తమపైన ఎవరి మాటలు ప్రభావం చూపలేవని గయక్వాడ్ స్పష్టం చేశారు.

భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా ఎంపికైన వ్యక్తికి బీసీసీఐ ఏడాదికి 7 కోట్ల 50 లక్షల రూపాయల వరకూ జీతం చెల్లిస్తూ వస్తోంది.

First Published:  31 July 2019 10:40 PM GMT
Next Story